సిరి, షణ్ముక్ ముద్దులు, కౌగిలింతలపై సిరి బాయ్ ఫ్రెండ్ రియాక్షన్..

siri hanmanth boyfriend shrihan | బిగ్ బాస్ హౌస్‌లో సిరి, షణ్ముఖ్ జస్వంత్ మధ్య ఉన్న రిలేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీళ్ల మధ్య బంధం రోజురోజుకు బలపడుతుంది. బయట ఇద్దరు కమిటెడ్. షణ్ముక్‌కు దీప్తి సునైనా.. సిరికి శ్రీహాన్ ఉన్నారు. వాళ్లు పెళ్లి కూడా చేసుకోవాలని అనుకుంటున్నారు. ఇలాంటి సమయంలో ఈ ఇద్దరూ బిగ్‌బాస్ ఇంటికి వచ్చారు. మొదట్లో ఇద్దరూ స్నేహితులుగా ఉన్నారు. కానీ గత కొన్ని వారాలుగా సిరి, షణ్ను మధ్య బలపడుతున్న బంధం చూసిన తర్వాత బయట ప్రేక్షకులకు లేనిపోని అనుమానాలు వస్తున్నాయి. అంతవరకు ఎందుకు.. తాజాగా ఇంట్లోకి వచ్చిన సిరి అమ్మగారు కూడా ఈ ఇద్దరి రిలేషన్షిప్ గురించి కాస్త తేడాగా మాట్లాడింది.
ఎంత ఫ్రెండ్స్ అయినా కూడా తన కూతురిని షణ్ముఖ్ జస్వంత్ కౌగిలించుకోవడం తనకు నచ్చడం లేదు అని అందరి ముందు చెప్పింది. దాంతో షణ్ముక్ బాగా హర్ట్ అయ్యాడు. అందుకే సిరితో మాట్లాడటం మానేశాడు. ఇద్దరూ బయట కమిటెడ్ అనే విషయం కూడా మరిచిపోయి ఎమోషనల్‌గా చాలా దగ్గర ఆగిపోయారు. ఇలాంటి సమయంలో ఇద్దరి రిలేషన్ గురించి సిరి బాయ్ ఫ్రెండ్ శ్రీహాన్ సోషల్ మీడియాలో స్పందించాడు. గతంలో దీప్తి సునైనా కూడా ఈ ఇద్దరి రిలేషన్ గురించి సోషల్ మీడియాలో ఒక పోస్టు పెట్టింది. ఇప్పుడు సిరి బాయ్ ఫ్రెండ్ కూడా ఇదే చేశాడు.
‘సిరి అమ్మ గారికి ఆ విషయాన్ని ఎలా చెప్పాలో తెలియక అలా అనేసింది.. పాపం వాళ్లు ఉంటున్న వాతావరణం అలాంటిది.. అక్కడ మనిషికి మనిషి తోడు ఉంటాడు. కాస్త ఎమోషనల్ అయినా కూడా తన ఫీలింగ్స్ మాటల కంటే కూడా కౌగిలింతలతోనే చెప్పాల్సి వస్తుంది. ఒక తల్లిగా కూతుర్ని బయట తప్పుగా అంటుంటే తట్టుకోలేక అలా అనేశారు. ఆంటీ ఇలా అంటారని నేను కూడా ఊహించలేదు. దయచేసి ఆమెను తప్పుగా అర్థం చేసుకోకండి. కూతురు మీద ఉన్న ప్రేమతో ఆంటీ అలా మాట్లాడారు. ఆమె తరపున నేను క్షమాపణలు చెబుతున్నాను. సిరి, షణ్ముఖ్ బంధాన్ని నేను గౌరవిస్తాను’ అని రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈయన చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Ravi: కూతురిని చూసి తెగ ఎమోషనల్ అయిన రవి
Jaswanth: సిరి చెంప పగలగొట్టేవాడిని అన్న జస్వంత్
Siri: పాన్ షాప్ నడిపి పెంచాను.. హగ్గులు ఇవ్వడం నచ్చడం లేదంటూ మండిపడ్డ సిరి తల్లి
Siri: షణ్ముఖ్‌ని హగ్ చేసుకోవడం నాకు నచ్చట్లేదు.. సిరి తల్లి షాకింగ్ కామెంట్స్
MANAS: మానస్ తల్లి పంచ్‌లకు బిత్తరపోయిన హౌజ్‌మేట్స్
Ravi: ఓవర్ థింకింగ్ చేస్తున్న రవి.. ఎదుటి వాళ్లు చెప్పేది వినాలన్న శ్రీరామ్ సోదరి
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Donations | తిరుమల దేవస్థానానికి విరాళాల వెల్లువ
Passengers sit on tracks | యువకుడిపై ఆర్పీఎఫ్ సిబ్బంది దాడి.. పట్టాలపై కూర్చొని రైలును అడ్డుకుని ప్రయాణికుల నిరసన
PM Modi | మోదీకి ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఫోన్.. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు రావాలని ఆహ్వానం
TGICCC | ఐసీసీసీలో దక్షిణాది రాష్ట్రాల పోలీసు సమన్వయ కమిటీ భేటీ
bathukamma celebrations | ఒరెగాన్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో గ్రాండ్‌గా బతుకమ్మ, దసరా వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

