బిగ్ బాస్ షో మరి కొద్ది రోజులలో ముగియనున్న నేపథ్యంలో కంటెస్టెంట్ ఫ్యామిలీస్‌ని ఇంట్లోకి ప్రవేశపెడుతున్న విషయం తెలిసిందే. గత ఎపిసోడ్లో కాజల్ భర్త, కూతురు వచ్చి తెగ సందడి చేశారు. దాదాపు 80 రోజుల తర్వాత భర్త, కూతురిని చూసి కాజల్ ఎమోషనల్ అయింది. ఇక ఈ రోజు మానస్ తల్లి, శ్రీరామ్ సోదరి, సిరి తల్లి రాబోతున్నట్టు ప్రోమో ద్వారా తెలియజేశారు.
మానస్ తల్లి ఇంట్లోకి రావడంతో ఆనందంతో ఎగిరి గంతులేశాడు మానస్. ఆమె కూడా మానస్‌ని ముద్దాడుతూ.. ఎమోషనల్ అయింది. చాలా సరదాగా ఉంటూ హౌజ్‌మేట్స్‌తో చిల్ అయింది. షణ్ముఖ్‌ని అయితే ‘అరేయ్ ఏంట్రా షన్నూ’ అంటూ షణ్ముఖ్‌ని ఆటపట్టించింది. శ్రీరామ్ ఆంటీ అని పిలవగా.. ‘ఎందుకు ఆంటీ అంటున్నావ్.. నేను నీ గర్ల్‌ఫ్రెండ్’అని అనడంతో ఇంటి సభ్యులంతా ఫక్కున నవ్వారు.
ఇక సిరి తల్లి ఎంట్రీ ఇవ్వడంతో సిరి ముఖంలో అన్ని రకాల ఎమోషన్స్ బయటపడ్డాయి.అయితే కూతురిని బాగా ఆడుతున్నావ్ అని ప్రొత్సహిస్తూనే.. షణ్ముఖ్‌ని హగ్ చేసుకోవడం నచ్చడం లేదని షాకింగ్ కామెంట్ చేసింది సిరి తల్లి. షణ్ముఖ్ సిరికి బాగా హెల్ప్ చేస్తున్నాడు, దగ్గరైపోతుంది. అది తనకు నచ్చడం లేదని చెప్పింది. ఆ సమయంలో డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చాడు. మరి దీనిపై షణ్ముఖ్ ఏ విధంగా స్పందిస్తాడో చూడాలి.