బిగ్ బాస్ హౌజ్‌లోకి కంటెంస్టెంట్స్ ఫ్యామిలీ ఒక్కొక్కరుగా వస్తున్నారు. శ్రీరామ్ చెల్లెలు వచ్చి వెళ్లిన తరువాత హౌస్‌లోకి మానస్ తల్లి పద్మిని వచ్చారు. మానస్ కూల్ అండ్ కామ్‌గా ఉంటే.. ఆమె తల్లి మాత్రం అందుకు భిన్నంగా ఉంది. నీ దృష్టంతా టాప్ 5లో చేరడంపైనే ఉండాలని చెప్పింది. పక్కవాళ్లు డిస్టర్బ్ చేస్తున్నా డిస్టర్బ్ కాకుండా ఆడితే తప్పకుండా ఫినాలేకు చేరుకుంటావని ధైర్యం నూరిపోసింది. అందరికంటే పింకీ అందంగా కనిపిస్తుందని ఆమెను మెచ్చుకుంది.
నా కొడుక్కి పెళ్లిళ్లు చేస్తావా? ఏంగేజ్ మెంట్లు చేస్తావా? అని రవిపై సెటైర్లు వేసింది మానస్ తల్లి పద్మిని. ఆ డైలాగ్‌తో ప్రియాంక నోరెళ్లబెట్టింది. పెళ్లిళ్ల పేరయ్య వాడు (షణ్ముఖ్) కదా అనగానే పద్మిని.. నువ్ ఎట్టా అయ్యావ్ అంటూ నువ్ నాకు హగ్ ఇయ్యి నేను వెళ్లి ఆ హగ్‌ని అక్కడ (దీప్తి) ఇచ్చేస్తా అని వరుస పంచ్‌లు వేసింది పద్మిని.
ఇక శ్రీరామ్ ఆంటీ మీరు ఇక్కడే ఉండండి. అని అంటే ఆంటీ అంటావ్ ఏంటి? అక్క అని అనండి అంటూ ఫుల్ స్వింగ్‌లో కనిపించారు మానస్ తల్లి. ఆ తరువాత శ్రీరామ్.. ఆంటీ మీరు ఏజ్ తగ్గించుకోవల్సిన అవసరం లేదు.. ఇప్పుడు కూడా హాట్‌గానే ఉన్నారని పంచ్ వేశాడు. ఆ తరువాత మానస్‌కి నాకు మీలాంటి అమ్మాయిని చూడండి ఆంటీ పెళ్లి చేసుకుంటామ్ అని శ్రీరామ్ అనగా.. ఇద్దరికీ ఒకేసారి పెళ్లి చేసేస్తాలే అని అంటూ అవునూ.. నీకోసం బయట హమీదా వెయిటింగ్ ఏమో అని అదిరిపోయే పంచ్ వేసింది పద్మిని. ఈమె ఉన్నంత సేపు హౌజ్‌మేట్స్ ఫుల్ జోష్‌లో ఉన్నారు.