బిగ్ బాస్ హౌజ్ ప్రస్తుతం ఎంటర్టైన్మెంట్ మూడ్‌లో ఉంది. కొట్లాటలు, గొడవలు, అరుపులకు కొంత విరామం దొరికింది. ఫ్యామిలీ మెంబర్స్ ఇంట్లోకి వస్తుండడంతో సందడి నెలకొంది. బుధవారం ఎపిసోడ్లో కాజల్ భర్త, ఆమె కూతురు వచ్చారు. ఆమెకు ఇవ్వాల్సిన సలహాలు ఇచ్చి వెళ్లాడు. అయితే కాజల్ భర్త వెళ్లిపోయాక ఇంట్లో కొన్ని డిస్కషన్స్ నడిచాయి. మీ ఆయన మస్త్ చిల్ ఉన్నాడు నీలా కాదంటూ సన్నీ, మానస్లు పంచ్‌లు వేశారు.
ఇక శ్రీరామ్, రవిలకు తన భర్త ఇచ్చిన జలక్ని కాజల్ మానస్, సన్నీలతో షేర్ చేసుకుంది. మీ ఫ్రెండ్‌ని మీరు కాపాడుకోలేకపోయారని అన్నట్టుగా వాళ్లతో చెప్పింది. అయితే కాజల్ భర్త అన్న మాటలను కాస్త లోతుగా ఆలోచించి శ్రీరామ్‌తో డిస్కషన్ పెట్టాడు రవి. కాజల్ టాప్‌లో ఉంటే బాగా ఆడు అని చెప్పేవాడు. కాని ఒకరి పేరు చెప్పి సార్ట్ ఔట్ చేసుకో అంటున్నాడంటే వాడితో పెట్టుకుంటే ఔట్ అయిపోతా అనే లెక్క ఉంటుంది.
కాజల్ భర్త మాట్లాడిన మాటలను శ్రీరామ్‌కి ఎక్కేలా గట్టిగా ట్రైట చేశాడు రవి. కొద్ది సేపటి తర్వాత శ్రీరామ్ సోదరి హౌజ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. గేమ్ ప్లాన్ గురించి నీట్‌గా శ్రీరామ్‌కి వివరించింది. నీ క్లారిటీ నీకు ఉండొచ్చు కానీ.. నీ పాయింట్ నువ్ చెప్పాలని అని అనుకున్నప్పుడు ఎదుటివాళ్ల పాయింట్ కూడా వినాలి కదా.. ఎమోషన్లో ట్రిప్ అవుతారు కానీ.. ఎదుటివాళ్లు చెప్పేది కూడా విను. ఎందుకు ప్రతి విషయాన్ని అంత సాగిదీస్తూ చెప్పింది చెప్తావ్.. అని చెప్పింది అశ్విని.