బిగ్ బాస్ హౌజ్‌లోకి ఫ్యామిలీస్ వస్తున్న నేపథ్యంలో హౌజ్‌మేట్స్ చాలా ఎమోషనల్ అవుతున్నారు. ప్రేక్షకులు కూడా వారి మధ్య ఉన్న బాండింగ్ చూసి భావోద్వేగానికి గురవుతున్నారు. ఇప్పటికే కాజల్, శ్రీరామచంద్ర, సన్నీ, సిరి, మానస్‌ల కుటుంబసభ్యులు హౌజ్‌లోకి వచ్చి తెగ సందడి చేసి వెళ్లారు. ఇక ఈ రోజు యాంకర్ రవి కోసం భార్య నిత్య, కూతురు వియా వచ్చారు.
వియా రాకతో రవి ఆనందం అవధులు దాటింది. కూతురిని ఎంతగానో ప్రేమించే రవి ఆమెని చూసి ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యాడు. ముందుగా రవి భార్య నిత్య వచ్చి రవిని హగ్ చేసుకొని ఏడ్చేసింది వియా రాలేదా అంటూ అడిగాడు రవి. రాలేదు అని చెప్పగానే డల్ అయ్యాడు. అంతలోనే పప్పా అంటూ వియా మాట వినబడటంతో పరిగెత్తుకుంటూ బయటకి వచ్చాడు రవి.
వియా పరిగెత్తుకుంటూ వచ్చి రవిని హాగ్ చేసుకుంది. వియాని ఎత్తుకొని కబుర్లు చెప్పాడు ఆడించాడు. హౌస్ లో కంటెస్టెంట్స్ కూడా వియాతో ఆడుకున్నారు. అయితే హౌజ్‌ని వదిలి వెళ్లే సమయంలో వియా కన్నీరు పెట్టుకుంది. అది చూసి రవినే కాదు ఆడియన్స్ కూడా కన్నీరు పెట్టుకున్నారు. ప్రోమో మాత్రం చాలా బాగుందంటూ నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు.