ప్రతి శనివారం మాదిరిగానే ఫుల్ జోష్‌తో నాగార్జున హౌజ్‌మేట్స్‌ని పలకరించారు. ఎప్పటి మాదిరిగానే వారితో ఓ గేమ్ ఆడించాడు. కంప్లైంట్ బాక్స్ ఎదురుగా ఉంచి హౌస్‌లో ఎవరిమీదైనా ఫిర్యాదులుంటే చెప్పాలని ఆదేశించాడు. వాళ్ల పేరు రాసి కంప్లైంట్ బాక్స్‌లో వేయాలని అన్నారు. మొదటిగా సన్నీని పలిచారు. సన్నీ.. తన ఫస్ట్ కంప్లైంట్లో భాగంగా సిరి పేరు చెప్పాడు. నేను హౌస్‌లోకి వచ్చినప్పుడు నా ఫస్ట్ ఫ్రెండ్ సిరి.. కానీ వెళ్లేలోపైనా ఫ్రెండ్ అవుతుందని అనుకుంటే.. అలాంటి పరిస్థితులు కనిపించడం లేదు’ అని చెప్పాడు.
ఐస్‌లో కాలు తీయకుండా మొండిగా ఆడింది అని చెప్పాడు. నువ్ కంప్లైంట్ చేస్తున్నావా? జాలిపడుతున్నావా? సిరి టాస్క్ ఎలా ఆడాలో అలాగే ఆడిందా? రాంగ్గా ఆడిందా? అని మళ్లీ ప్రశ్నించారు నాగార్జున. కోపంగా ఆడింది సార్.. అని సన్నీ అనడంతో.. నువ్వూ కోపంగానే ఆడతావ్గా.. తను కూడా అలాగే ఆడింది బరాబర్ ఆడింది.. అంటూ సిరిని ఎత్తేశారు నాగార్జున. చివర్లో నాగార్జున.. సన్నీ నువ్ ఫీల్ కాకు అపనా టైం ఆయగా అంటూ అదిరిపోయే పంచ్ ఇచ్చారు. దీంతో సన్నీ ముఖం వెలిగిపోయింది.
సిరిని నీ కంప్లైంట్ ఎవరిపైన అని అడగ్గా.. షణ్ముఖ్ పేరు చెప్పింది. నన్ను బాగానే చూసుకున్నాడు కానీ.. తిడుతున్నాడు అని చెప్పింది. ఏం చేస్తాడు.. నువ్ ఫ్రెండ్ అని చెప్పడానికి సిగ్గుపడుతున్నాడు అని పంచ్ వేసిన నాగార్జున.. అయినా నువ్ ఫ్రెండ్లీ హగ్‌లు ఇస్తూనే ఉన్నావ్ కదా? అని సిరిని ఉద్దేశించి అన్నారు. ఇక సిరి పెద్దగా నవ్వుతూ.. మా మమ్మీకి ఫ్రెండ్ షిప్ హగ్ అని చెప్తూనే ఉన్నాడు సార్ అని అనడంతో.. షన్నూ జాగ్రత్తగా చూసుకోరా? అని చెప్పారు నాగార్జున.