బిగ్ బాస్ కార్యక్రమంలో 13 వారం నామినేషన్ ప్రక్రియ కాస్త డిఫరెంట్‌గా జరిగింది. ఇంటిసభ్యులు తగిన కారణాలు చెప్తూ ఇద్దరు సభ్యుల ముఖం ఉన్న బాల్స్‌ను గేటు బయటకు తన్నాలి అని బిగ్ బాస్ చెప్పారు. ముందుగా కెప్టెన్ షణ్ముఖ్ రంగంలోకి దిగాడు. కమ్యూనిటీ పేరు తీయడం తప్పంటూ కెప్టెన్ షణ్ముఖ్ కాజల్‌ను నామినేట్ చేశాడు. అలాగే ప్రియాంకను నామినేట్ చేస్తూ ఆమె ఫేస్ ఉన్న బంతిని తన్నాడు.
ఇక ప్రియాంక నామినేషన్ టైం రాగా, ఆమె కాస్త టైం అడిగింది. షణ్ముఖ్‌ని చేయాలని అనుకుంటే అతడు కెప్టెన్ అయి సేవ్ జోన్లో ఉన్నాడు. అందుకే ఎవరిని నామినేట్ చేయాలా అని ఆలోచిస్తున్నాను అని ప్రియాంక అనగా, నామినేషన్స్ తెలపకపోతే నేరుగా నామినేట్ అవుతావని హెచ్చరించాడు. దీంతో పింకీ.. సిరిని, కాజల్‌ను నామినేట్ చేసింది . కమ్యునిటీ విషయం తాను లేవనెత్తడం తన మిస్టేక్ అయితే.. అదే విషయాన్ని కాజల్ కూడా చెప్పడం తనకి నచ్చలేదని చెప్పింది ప్రియాంక.
శ్రీరామ్.. మానస్‌ని నామినేట్ చేస్తూ పాత గొడవల్ని తవ్వుకొచ్చాడు. రెండో నామినేషన్స్‌లో భాగంగా శ్రీరామ్.. కాజల్‌ని నామినేట్ చేస్తూ నేనంటే చులకనా అని అడిగాడు. దీంతో ఇద్దరి మధ్య డిస్కషన్ నడిచింది. ఇక సిరి.. ప్రియాంకను నామినేట్ చేస్తూ.. నియంత టాస్క్‌లో తనని డిస్ క్వాలిఫై చేసిన రీజన్ తనకి నచ్చలేదని చెప్పింది. షణ్ముఖ్ నామినేట్ చేసిన వాళ్లనే సిరి చేస్తుండగా, ఈ వారం షణ్ముఖ్.. ప్రియాంక, కాజల్‌ని నామినేట్ చేశాడు కాబట్టి సిరి కూడా కాజల్, ప్రియాంకలను నామినేట్ చేసింది.