బీబీ హోటల్ టాస్క్‌లో షణ్ముఖ్ హోటల్ చెఫ్ కాగా, సిరి..డాన్ కూతురుగా సకల మర్యాదలు అందుకునే పాత్రలో నటించింది. ఇక హోటల్‌కి వెళ్ళిన సిరి అక్కడ చెఫ్‌గా ఉన్న సిరికి చుక్కలు చూపించింది.అతనితో మూడు చెరువుల నీళ్లు తాగించింది. సిరితో ఈజీ కాదు అని పాట పాడుతూ స్విమ్మింగ్ పూల్‌లోని నీటిని స్పూన్‌తో తీస్తూ కాఫీ కప్పు నింపాడు షణ్ను
షణ్ముఖ్ పనికి ఇంప్రెస్ అయిన సిరి కొంత టిప్ ఇచ్చింది. ఇక సన్నీతనను టచ్ చేస్తుంటే సైలెంట్‌గా ఉన్నావేంటని మానస్‌పై ఫైర్ అయింది ప్రియాంక. ఇక ఈ వారం కెప్టెన్సీ పోటీదారుల టాస్క్‌లో భాగంగా బీబీ హోటల్ అనే టాస్క్ లో హౌస్ కీపింగ్ స్టాఫ్‌లో ఒకరిగా ఉన్న రవి .. హోటల్ స్టాఫ్ ఇచ్చే అతిధ్యానికి ఆటంకం కలిగించి అతిథులకు మీ పని ఎక్కువ నచ్చేట్టు చేయాలని చెప్పారు. ఈ సీక్రెట్ టాస్క్ గురించి ఎవరికైనా చెప్పినా.. దొరికిపోయినా కెప్టెన్ పోటీదారులయ్యే ఛాన్స్ పోతుందని చెప్పారు బిగ్ బాస్.
మరోపక్క రవి.. కాజల్ బ్యాగులోంచి డబ్బులు కొట్టేసి ఏమీ ఎరగనట్లున్నాడు. దీంతో కాజల్ డబ్బులు పోయాయంటూ మొత్తుకుంది . ఇక బిగ్ బాస్ హౌజ్‌లో పెట్టిన కేక్ ముక్కని ఎవరికి తినే అర్హత ఉందని అంటుండగా సన్నీ చటుక్కున మింగేశాడు. మీకు అర్హత ఉంటే తినండి మరి.. లేదంటే నేను తినేస్తా.. రిస్క్ తీసుకుంటా.. అని ముందుకు వచ్చాడు.
సీక్రెట్ రూంలో ఉన్న జస్వంత్ అభిప్రాయాన్ని అడిగారు బిగ్ బాస్. ఆ కేక్ తినడానికి ఎవరు అర్హులని అనుకుంటున్నారు అని అడగ్గా.. రవికి అర్హత ఉంది.. తొమ్మిది వారాల్లో 8 వారాలు నామినేషన్స్‌లో ఉన్నాడు.. ఫైటింగ్ చేస్తున్నాడు అని చెప్పాడు జెస్సీ.