Rajinikanth | తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘కూలీ’ విడుదలకు ఇంకా ఐదు రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వస్తోన్న ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలు సినీ ప్రియులని ఎంతగానో ఆకట్టుకున్నాయి. దాంతో సినిమా ప్రీ రిలీజ్ హైప్ మరో స్థాయికి వెళ్లిపోయింది. ఈ సారి బాక్సాఫీస్ దగ్గర రజనీ మాస్ ఫైర్ గ్యారంటీ అని అభిమానులు ధీమాగా చెబుతున్నారు. ఈ సినిమాకు భారత్‌లో మాత్రమే కాదు, విదేశాల్లోనూ సూపర్ రెస్పాన్స్ వస్తోంది. నార్త్ అమెరికాలో ఇప్పటికే ‘కూలీ’ అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా $1.5 మిలియన్ (సుమారు ₹12.5 కోట్లు) వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.
ఇది ఓ దక్షిణాది సినిమా ఓపెనింగ్ సాధించిన భారీ ఫిగర్ అనే చెప్పాలి. ఈ రేంజ్ బుకింగ్స్ చూస్తుంటే, తొలి రోజునే భారీ ఓపెనింగ్ వసూళ్లు దక్కడం ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ చిత్రంలో రజనీకాంత్‌కు తోడుగా నాగార్జున, ఉపేంద్ర, సత్యరాజ్, అమీర్ ఖాన్, శ్రుతి హాసన్ వంటి భారీ తారాగణం నటిస్తోంది. ఒక్కో పాత్ర కూడా ఓ స్పెషల్ హైలైట్‌గా నిలిచేలా డిజైన్ చేసినట్టు తెలుస్తోంది. ఇప్పటివరకు సినిమాకు సంబంధించి విడుదలైన పాటలు, మ్యూజిక్ హైప్ క్రియేట్ చేశాయి. ప్రత్యేకంగా “పవర్ హౌస్” సాంగ్‌కు వచ్చిన రెస్పాన్స్ సినిమాపై హైప్‌ను రెట్టింపు చేసింది. ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్ గా పని చేసిన అనిరుధ్ మరోసారి తన మ్యాజిక్ చూపించనున్నాడు.
అయితే పవర్ హౌజ్ పాటకు సింగపూర్ పోలీస్ ఫోర్స్ తమ ఇన్ స్టాలో ఓ క్రేజీ వీడియో షేర్ చేసి సినీ ప్రియుల ఆనందాన్ని రెట్టింపు చేశారు. కూలీ చిత్రంలోని పవర్ హౌస్ పాటకు సింగపూర్ పోలీసులు విభిన్నంగా వైబ్ సెట్ చేసిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఇక ఈ వీడియో చూసిన తలైవా అభిమానులు ఇది కదా రజనీ క్రేజ్ అంటే అని ఫుల్ ఖుషీ అవుతున్నారు. ప్రస్తుతం సింగపూర్ పోలీసుల వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మించిన ఈ భారీ మల్టీ స్టారర్ ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. రజనీ అభిమానులకు ఆ రోజు పండగే అని చెప్పాలి. చాలా రోజుల తర్వాత థియేటర్స్ అన్నీ కళకళలాడనున్నాయి. అయితే రిలీజ్ రోజు కూలీ ఏ రేంజ్లో రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి!