Simran | ఇప్పటి తరం వారికి సిమ్రాన్ అంటే పెద్దగా తెలియకపోవచ్చు కాని 90,2000 సంవత్సరాలలో సిమ్రాన్ ఓ ఊపు ఊపేసింది. తెలుగులో, తమిళంలో స్టార్ హీరోయిన్ గా రాణించిన సిమ్రాన్ టాలీవుడ్ స్టార్ హీరోలు అందరితో కలిసి పని చేసింది. అయితే సిమ్రాన్ ప్రేమ, పెళ్లికి సంబంధించి అప్పట్లో అనేక ప్రచారాలు నడిచేవి. తెలుగులో ఓ స్టార్ హీరోతో ప్రేమలో పడిందని, ఆ హీరో కూడా ఆమెతో ప్రేమలో మునిగితేలడంతో పాటు ఇద్దరు పెళ్లి చేసుకోవాలని కూడా అనుకున్నారని వార్తలు వచ్చాయి. అయితే హీరోయిన్స్‌ని పెళ్లి చేసుకోవడం హీరో తండ్రికి నచ్చకపోవడంతో సిమ్రాన్ ఆ హీరోని వివాహం చేసుకోలేకపోయిందని ఓ టాక్.
మరోవైపు కమల్ హాసన్‌తో కలిసి బ్రహ్మచారి, పంచతంత్రం, పమ్మల్ కె.సంబంధం వంటి సినిమాల్లో నటించింది సిమ్రాన్. ఆ సమయంలోనే కమల్‌తో సిమ్రాన్ రిలేషన్లో ఉందంటూ వార్తలు కూడా వచ్చాయి. ఇద్దరి మధ్య ఏం జరిగిందో ఏమో కాని వారు బ్రేకప్ చెప్పుకున్నారు. ఇక రాజ సుందరంతోను సిమ్రాన్ రిలేషన్ షిప్లో ఉందనే ప్రచారం నడిచింది. కమల్‌తో కలిసి సిమ్రాన్ ఓ లిప్‌లాక్ సన్నివేశంలో నటించగా, అది నచ్చని రాజ సుందరం ఆమెకి బ్రేకప్ చెప్పాడట. రాజ సుందరంతో బ్రేకప్ తర్వాత సిమ్రాన్ దీపక్ బగ్గా అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. ప్రస్తుతం తమిళంలో పలు షోలకు సిమ్రాన్ జడ్జీగా వ్యవహరిస్తున్నారు.
ఇక సిమ్రాన్‌కి ఇద్దరు చెల్లెళ్లు ఉండగా, వారిద్దరు కూడా తెలుగులో క్రేజీ హీరోయిన్లు అన్న విషయం చాలా మందికి తెలియదు. సిమ్రాన్ ఇద్దరు చెల్లెళ్ల పేర్లు మోనాల్, జ్యోతి ఆనంద్. వీరిద్దరు ఇండస్ట్రీలో ఓ మేర రాణించారు. మోనాల్ తమిళంతో పాటు తెలుగులోను నటించింది.. బద్రి తమిళ రీమేక్ సినిమాలో నటించింది మోనాల్. 2001లో వచ్చిన ఇష్టం సినిమాలో కూడా మోనాల్ నటించింది. కాగా.. మోనాల్ కేవలం 21 ఏళ్లకే సూసైడ్ చేసుకుని చనిపోయింది. చెన్నైలోని తన ప్లాట్‌లో ఉరేసుకుని చనిపోవడం అప్పట్లో కలకలం రేపింది.ఆమె ఆత్మహత్యకు కొరియోగ్రాఫర్ ప్రసన్న సుజిత్ కారణమని ఆమె సోదరి సిమ్రాన్ గతంలో ఆరోపించింది.