SitharaEntertainments | తమిళ సూపర్‌స్టార్ సిలంబరసన్ (సింబు) తెలుగులో సినిమా చేయబోతున్నట్లు తెలుస్తుంది. ప్రముఖ తెలుగు నిర్మాణ సంస్థ సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ శింబుతో సినిమా ఓకే చేసినట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై చిత్ర నిర్మాత నాగవంశీ స్పందించాల్సి ఉంది. ఈ ప్రాజెక్ట్ తెలుగుతో పాటు తమిళంలో ఏకకాలంలో తెరకెక్కుతుండగా.. ఈ చిత్రంతో టాలీవుడ్‌కి కొత్త దర్శకుడు పరిచయం కాబోతున్నట్లు తెలుస్తుంది. కాగా దీనిపై సితార బ్యానర్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
మన్మథ, వల్లభ, మానాడు సినిమాలతో తెలుగులో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు శింబు. రీసెంట్గా మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన థగ్ లైఫ్‌లో కూడా కీలక పాత్రలో మెరిశాడు. అయితే శింబు చాలా రోజుల తర్వాత తెలుగు సినిమా చేస్తుండటంపై ప్రేక్షకులలో ఆసక్తి నెలకొంది.