SIIMA: నామినేషన్స్‌లో సత్తా చాటిన మహర్షి

సినీ పరిశ్రమకు సంబంధించిన అవార్డ్ వేడుకలలో సైమా ఒకటి. దక్షిణాది చిత్ర పరిశ్రమలో ‘సైమా’ అవార్డులను (సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్) ప్రతిష్ఠాత్మకంగా భావిస్తుంటారు. కరోనా వలన గత మూడేళ్లుగా సైమా అవార్డ్ వేడుక నిర్వహించలేదు. అయితే ఈ ఏడాది హైదరాబాద్‌లో సైమా వేడుకని నిర్వహించనున్నట్టు ఛైర్ పర్సన్ బృందా ప్రసాద్ ఈ మేరకు ప్రకటన కూడా విడుదల చేశారు.
తాజాగా 2019 సంవత్సరానికి గానూ వివిధ కేటగిరీలలో నామినేట్ అయిన మోస్ట్ పాపులర్ సినిమాల జాబితాను ప్రకటించారు. ఇందులో ‘మహర్షి’ (తెలుగు) – ‘అసురన్’ (తమిళం) – ‘యజమానా’ (కన్నడ) – ‘కుంబలంగి నైట్స్’ (మలయాళం) చిత్రాలు సైమా నామినేషన్ లలో ముందున్నాయి. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందిన ‘మహర్షి’ మూవీ 10 విభాగాల్లో నామినేట్ అయింది. బెస్ట్ ఫిలిం ,బెస్ట్ డైరెక్టర్ , బెస్ట్ యాక్టర్, బెస్ట్ యాక్ట్రెస్ , బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ ,బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ ,బెస్ట్ లిరిసిస్ట్ ,బెస్ట్ ప్లే బ్యాక్ సింగర్ (మేల్) , బెస్ట్ విలన్ , బెస్ట్ సినిమాటోగ్రాఫర్ కేటగిరీలలో నేషనల్ అవార్డ్ ఫిల్మ్ ‘మహర్షి’ నామినేట్ అయింది.
చైతూ, సమంత ప్రధాన పాత్రలలో రూపొందిన మజిలీ చిత్రం 9 విభాగాలలో నామినేట్ కాగా, నాని- గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్లో రూపొందిన జెర్సీ 7 విభాగాలలో నామినేట్ అయింది. మలయాళంలో ఫహద్ ఫాజిల్ నటించిన ‘కుంబళంగి నైట్స్’ ఏకంగా 13 కేటగిరీలలో నామినేట్ అవడం గమనార్హం. కన్నడ ‘యజమాన’ సినిమా 12 నామినేషన్లు పొందింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- maharshi
- Nominations
- siima
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

