మహన్, శృతి, మోహన్ సిద్ధి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘సిద్ధుగాడి లవ్‌స్టోరీ’. రమేష్.సి దర్శకుడు. సావిత్రమ్మ.సి నిర్మాత. ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్ లాంచ్ ఈవెంట్ హైదరాబాద్‌లో జరిగింది. ప్రముఖ దర్శకుడు వి.ఎన్.ఆదిత్య ఈ కార్యక్రమానికి అతిథిగా విచ్చేసి చిత్ర బృందానికి శుభాకాంక్షలు అందించారు.
ఈ ప్రేమకథలో సందేశం కూడా ఉంటుందని హీరో మహన్ చెప్పారు. ఈ సినిమాలో నటించడం పట్ల హీరోయిన్లిద్దరూ ఆనందం వెలిబుచ్చారు. ఈ సినిమాలో చక్కని పాటలు కుదిరాయని సంగీత దర్శకుడు అధిరవ్ కృష్ణ తెలిపారు. సుమన్, స్నేహ, ఆనంద్ భారతి, సర్కార్, అలీష, చిత్రంశ్రీను తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి మాటలు: మెండెం శ్రీధర్, కెమెరా: దోసడ యాదగిరి.