Nepal Rains | నేపాల్లో భారీ వర్షాలు, వరదలు.. ఉప్పొంగుతున్న నదులు..!
Nepal Rains | హిమాలయ దేశం నేపాల్ (Nepal) ను భారీ వర్షాలు (Heavy rains), వరదలు (Floods) ముంచెత్తుతున్నాయి. దేశవ్యాప్తంగా రుతుపవనాలు చురుగ్గా ఉండటంతో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దాంతో పలు ప్రధాన నదులు ఉద్ధృతంగా ప్రవహిస్తూ ప్రమాదకరస్థాయికి చేరువయ్యాయి.
Nepal Rains : హిమాలయ దేశం నేపాల్ (Nepal) ను భారీ వర్షాలు (Heavy rains), వరదలు (Floods) ముంచెత్తుతున్నాయి. దేశవ్యాప్తంగా రుతుపవనాలు చురుగ్గా ఉండటంతో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దాంతో పలు ప్రధాన నదులు ఉద్ధృతంగా ప్రవహిస్తూ ప్రమాదకరస్థాయికి చేరువయ్యాయి. ఈ నేపథ్యంలో అధికారులు దేశంలోని మధ్య, పశ్చిమ, తూర్పు ప్రాంతాల ప్రజలకు వరద హెచ్చరికలు జారీచేశారు. ప్రజలందరూ అత్యంత అప్రమత్తంగా ఉండాలని, సురక్షిత ప్రాంతాలకు వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు.
నేపాల్ హైడ్రాలజీ అండ్ మెటియరాలజీ విభాగం ఫ్లడ్ ఫోర్కాస్టింగ్ డివిజన్ వెల్లడించిన వివరాల ప్రకారం.. బుధవారం ఉదయం 6 గంటలప్పటికి మూడు ప్రధాన నదుల్లో నీటిమట్టాలు హెచ్చరిక స్థాయిని దాటాయి. సింధూలి జిల్లాలోని సన్ కోశీ నది, గూర్ఖా జిల్లాలోని బుధి గండకి నది, దడెల్ధురా జిల్లాలోని మహాకాళి నదుల్లో నీటి ప్రవాహం ఆందోళనకరంగా ఉంది. ఈ నదుల్లో నీటిమట్టం మరింత పెరిగే ప్రమాదం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు లమ్జంగ్ జిల్లాలోని మర్స్యంగ్ది నదిలో ప్రవాహం ఇప్పటికే ప్రమాదకర స్థాయిని దాటింది.
నిన్న రాత్రి 11:15 గంటలకు భుకుందెబెసి వాటర్ లెవెల్ మానిటరింగ్ కేంద్రం వద్ద ఈ నది ప్రమాద స్థాయిని దాటినట్లు అధికారులు గుర్తించారు. ప్రస్తుతం ఈ నదిలో నీటిమట్టం ఇంకా పెరుగుతూనే ఉందని, ఇది తీవ్ర ఆందోళన కలిగిస్తోందని ఫ్లడ్ ఫోర్కాస్టింగ్ డివిజన్ పేర్కొన్నది. దాంతో నదీ పరివాహక ప్రాంతాల్లో వరద ముప్పు ఎక్కువగా ఉందని హెచ్చరించింది. ఈ పరిణామాల నేపథ్యంలో నేషనల్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ అండ్ మేనేజ్మెంట్ అథారిటీ ప్రజలకు కీలక సూచనలు చేసింది.
ముఖ్యంగా మర్స్యంగ్ది నది దిగువ ప్రాంతాల ప్రజలు వెంటనే అప్రమత్తం కావాలని కోరింది. నదీ తీర ప్రాంతాల్లో నివసించే ప్రజలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని, అవసరమైతే సురక్షిత ప్రాంతాలను ముందుగానే గుర్తించి సిద్ధంగా ఉండాలని విజ్ఞప్తి చేసింది. ప్రస్తుతం రాజధాని ఖాట్మండు సహా దేశంలోని అనేక ప్రాంతాల్లో వర్షాలు కొనసాగుతున్నందున, ప్రజలు అధికారిక హెచ్చరికలను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలని అధికారులు సూచించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mahabubnagar | ‘నా భార్య ఇజ్జత్ తీస్తుంది.. బతకాలని లేదు’.. తల్లిదండ్రులకు సెల్ఫీ వీడియో పంపి యువకుడు అదృశ్యం
Lateef Bhat: మసీదులో దాక్కున్న లతీఫ్ భట్.. కుల్గాం ఎన్కౌంటర్లో హతం
Cyclone Akvan | ఏపీ తీరానికి అక్వాన్ తుపాను ముప్పు.. తీవ్ర తుపానుగా బలపడిన వాయుగుండం!
Russian Plane Crash | రష్యాలో కుప్పకూలిన సైనిక విమానం.. 19 మంది మృతి!
Javed Akhtar: ప్రతి భారతీయుడి రక్తంలో రాముడున్నాడు.. జావెద్ అక్తర్ వ్యాఖ్యలను ఖండించిన ముస్లిం నేత
ట్రెండింగ్ వార్తలు
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video

