Siddu Jonnalagadda | ప్రస్తుతం ఉన్న కుర్ర హీరోలలో తన నటనతో, డైలాగ్ డెలివరీతో ఆకట్టుకుంటున్న కథానాయకుడు సిద్ధు జొన్నలగడ్డ. ‘డీజే టిల్లు’(DJ Tillu), టిల్లు 2 చిత్రాలతో తనకంటూ స్టార్ హీరోగా మారాడు. అయితే సిద్ధు తాజాగా నటిస్తున్న చిత్రం జాక్(Jack Movie).
బొమ్మరిల్లు భాస్కర్ (Bommarillu Bhaskar) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్ తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే రేపు సిద్ధు పుట్టినరోజు కానుకగా ఈ మూవీ టీజర్‌ని విడుదల చేయనున్నట్లు చిత్రబృందం తెలిపింది. ఈ సందర్భంగా కొత్త పోస్టర్ని పంచుకుంది.
Tomorrow’s weather forecast: 100% chance of MASSACRE ENTERTAINMENT ❤️🔥❤️🔥
Catch #JackTeaser tomorrow at 11:07 AM 💥💥
It’s wild, it’s whacky… and you’ll see! 😎#Jack #JackOnApril10th #SidduJonnalagadda @iamvaishnavi04 @baskifilmz @SVCCofficial @JungleeMusicSTH #SVCC37… pic.twitter.com/fT4PUN2li9
— SVCC (@SVCCofficial) February 6, 2025