Tillu Square | టాలీవుడ్ యువ హీరో సిద్దు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda) టైటిల్ రోల్లో నటిస్తోన్న సీక్వెల్ ప్రాజెక్ట్ టిల్లు 2 (Tillu Square). డోనరుడా ఫేం మల్లిక్‌రామ్ (Mallik Ram) డైరెక్ట్ చేస్తున్నాడు. అనుపమ పరమేశ్వరన్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. ఇప్పటికే విడుదల చేసిన ఫన్ ట్రాక్ వీడియోతోపాటు టికెటే కొనకుండా పాటలకు మంచి స్పందన వస్తోంది. తాజాగా మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ అందించబోతున్నట్టు తెలియజేశారు మేకర్స్.
మా టిల్లు 2 టీం నుంచి రేపు ఉదయం 11:07 గంటలకు మేజర్ అప్డేట్ అందిస్తున్నాం. వేచి ఉండండి.. మిస్సవద్దు.. అంటూ ట్వీట్ చేశారు. ఇంతకీ ఈ నయా అప్డేట్ ఏంటనేది మాత్రం సస్పెన్స్‌లో పెట్టేశారు. సిద్దు జొన్నల గడ్డ, అనుపమ పరమేశ్వరన్ ట్యాక్సీలో రొమాంటిక్ మూడ్‌లో ఉన్న పోస్టర్ ఒకటి ఇప్పటికే నెట్టింట వైరల్ అవుతోంది. టిల్లు 2 నవంబర్‌లో ప్రేక్షకుల ముందుకు రానుండగా.. మేకర్స్ నుంచి రిలీజ్ డేట్‌పై క్లారిటీ రావాల్సి ఉంది.
సిద్దు జొన్నల గడ్డ ఈ సారి టిల్లు 2లో టైటిల్‌కు తగ్గట్టుగా డబుల్ ఎంటర్టైన్మెంట్ అందించబోతున్నట్టు చెప్పకనే చెబుతున్నాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్‌తో అసోసియేట్ అవుతూ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి రామ్ మిర్యాల సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రంలో మురళీధర్ గౌడ్, ప్రణీత్ రెడ్డి ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
Attention Everybody! 🔊
Dropping a MAJOR update from our #TilluSquare tomorrow at 11:07am! 😎
Stay tuned & DON’T MISS IT! 🤩🕺#Siddu @anupamahere @MallikRam99 @ram_miriyala @NavinNooli #SaiPrakash @vamsi84 #SaiSoujanya @SitharaEnts @Fortune4Cinemas #SrikaraStudios… pic.twitter.com/uhGDO8D5tK
— BA Raju’s Team (@baraju_SuperHit) October 26, 2023
టికెటే కొనకుండా సాంగ్..
టికెటే కొనకుండా ప్రోమో..
టిల్లు 2 ఫన్ ట్రాక్ వీడియో..