‘టిల్లు స్కేర్’ చిత్రంతో మంచి విజయాన్ని అందుకొని జోష్ మీదున్నారు యువ హీరో సిద్ధు జొన్నలగడ్డ. ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘జాక్’. ‘కొంచెం క్రాక్’ ఉపశీర్షిక. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకుడు. బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మాత. వైష్ణవి చైతన్య కథానాయిక. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్లో జరుగుతున్నది.
ఇప్పటివరకు 80 శాతం చిత్రీకరణ పూర్తయిందని, ఈ నెల 15 నుంచి నేపాల్లో తదుపరి షెడ్యూల్ను ప్రారంభిస్తామని మేకర్స్ తెలిపారు. సిద్ధు జొన్నలగడ్డ కామెడీ టైమింగ్ ఆద్యంతం చక్కటి వినోదాన్ని పంచుతుందని, యువత మెచ్చే అన్ని అంశాలుంటాయని దర్శకుడు పేర్కొన్నారు.