సిద్ధు జొన్నలగడ్డ హీరోగా కరోనా టైమ్‌లో ఓటీటీలో విడుదలైన ‘కృష్ణ అండ్ హిజ్ లీలా’ సినిమా ఇంటితెర ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంది. ఆ సినిమానే ‘ఇట్స్ కాంప్లికేటెడ్’ అంటూ మళ్లీ థియేటర్లలో విడుదల చేశారు హీరో రానా దగ్గుబాటి. ఈ సినిమా దర్శకుడు రవికాంత్ పేరేపు. తొలి సినిమాతోనే మంచి అభిరుచి ఉన్న దర్శకుడిగా కితాబులందుకున్నారు రవికాంత్. ఇదిలావుంటే.. ఇటీవలే రవికాంత్ చెప్పిన ఓ కథను సిద్ధు జొన్నలగడ్డ ఓకే చేశారట. ఈ సినిమాను సితార ఎంటైర్టెన్మెంట్స్ పతాకంపై నాగవంశీ నిర్మిస్తారని సమాచారం. గతంలో నిర్మాత నాగవంశీ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ‘సిద్దూతో ఓ సినిమా అనుకుంటున్నాం. మేం అనుకున్న కథని అలాగే స్క్రీన్‌పై ప్రెజెంట్ చేస్తే.. అది సందీప్‌రెడ్డి వంగా సినిమాలా అనిపిస్తుంది. సినిమా హిట్ అయితే సందీప్‌రెడ్డి వంగానే తీశాడంటారు. అదే ఫ్లాప్ అయితే.. సందీప్‌రెడ్డి ైస్టెల్లో ట్రై చేశారు.. మిస్‌ఫైర్ అయింది.. అంటారు.’ అని పేర్కొన్నారు. ఆ కథ ఈ కథేనని ఫిల్మ్ వర్గాల టాక్.