‘అర్జున్‌రెడ్డి’తో పోలిక ఉండదు
బాల నటుడిగా చాలా సినిమాలు చేశా. ‘మిణుగురులు’ చిత్రంలో నా పాత్రకు నంది అవార్డ్ కూడా వచ్చింది. అప్పుడే సినిమాలపై మరింత పాషన్ పెరిగింది’ అన్నారు దీపక్ సరోజ్. ఆయన కథానాయకుడిగా యశస్వీ దర్శకత్వంలో రూపొందిన ‘సిద్ధార్థ్‌రాయ్' చిత్రం ఈ నెల 23న విడుదలకానుంది.
‘బాల నటుడిగా చాలా సినిమాలు చేశా. ‘మిణుగురులు’ చిత్రంలో నా పాత్రకు నంది అవార్డ్ కూడా వచ్చింది. అప్పుడే సినిమాలపై మరింత పాషన్ పెరిగింది’ అన్నారు దీపక్ సరోజ్. ఆయన కథానాయకుడిగా యశస్వీ దర్శకత్వంలో రూపొందిన ‘సిద్ధార్థ్‌రాయ్’ చిత్రం ఈ నెల 23న విడుదలకానుంది. ఈ సందర్భంగా హీరో దీపక్ సరోజ్ మాట్లాడుతూ ‘ఈ సినిమాలో నా పాత్ర లాజికల్ ఎక్ట్స్రిమిజమ్లో ఉంటుంది. ఈ క్యారెక్టర్ కోసం చాలా ప్రిపేర్ అయ్యాను. ఫిలాసఫీ బుక్స్ కూడా చదివాను. సిద్ధార్థ్‌రాయ్ ఎంత కంట్రోల్డ్‌గా ఉంటాడో ఒక్కసారిగా అన్కంట్రోల్డ్గా మారతాడు. సిద్థార్థ్రాయ్ లుక్ ‘అర్జున్‌రెడ్డి’లా కనిపిస్తుంది కానీ..ఆ సినిమాతో కథకు ఎలాంటి పోలిక ఉండదు. నటుడిగా నా ప్రతిభను చూపించడానికి ఈ క్యారెక్టర్ ఓ అద్భుతమైన అవకాశంలా ఫీలయ్యాను. తాను నమ్మిన ఫిలాసఫీ కోసం ఎంత దూరమైనా వెళ్లేవాడిగా సిద్ధార్థ్‌రాయ్ పాత్ర ప్రతీ ఒక్కరికి గుర్తుండిపోతుంది. దర్శకుడు యశస్వీ ఇంట్రెస్టింగ్ స్క్రీన్‌ప్లేతో ఈ సినిమాను తీర్చిదిద్దాడు. త్వరలో రెండు సినిమాలు చేయబోతున్నా. మార్చి, జూన్‌లో అవి మొదలవుతాయి’ అన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

