Miss You Movie | గతేడాది చిన్నా సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న తమిళ నటుడు సిద్దార్థ్ తాజాగా తన కొత్త ప్రాజెక్ట్‌ను అనౌన్స్ చేశాడు. ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం మిస్ యూ (Miss You). కలథిల్ సంతిప్పోమ్, మాప్లా సింగం చిత్రాల ఫేమ్ ఎన్. రాజశేఖర్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా.. ఆషికా రంగనాథ్ కథానాయికగా నటించబోతుంది. ఈ మూవీ ఫస్ట్ లుక్‌ను ప్రముఖ నటుడు శివ కార్తికేయన్ ఎక్స్ వేదికగా విడుదల చేశాడు. ఈ పోస్టర్ చూస్తే.. రైల్వే స్టేషన్ నుంచి సిద్దార్థ్ వస్తున్నట్లు ఉంది. చాల రోజుల తరువాత ఈ పోస్టర్లో కొత్తగా కనిపిస్తున్నాడు. 7 మైల్స్ పర్ సెకండ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై శామ్యూల్ మాథ్యూ ఈ సినిమాను నిర్మిస్తుండగా.. జిబ్రాన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. కరుణాకరన్, బాల, సాస్తిక రాజేంద్రన్ తదితరులు ఈ సినిమాల కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
Happy to release the first look of my dear brother #Siddharth‘s #MissYou.
Wishing the best to the entire team for huge success 😊👍@7Milesps @cvsam @Dir_RajasekarN @AshikaRanganath @GhibranVaibodha #Karunakaran @bala_actor #LollusabhaMaran @Sastika_R @kgvenkatesh_in @Dponnuraj… pic.twitter.com/NsadmBFbeV
— Sivakarthikeyan (@Siva_Kartikeyan) June 6, 2024