Siddharth | తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేని నటుడు సిద్దార్థ్ (Siddharth). తమిళ ఇండస్ట్రీ నుంచి తెలుగులోకి ఎంట్రీ ఇచ్చినా.. చాలా మంది సిద్దార్థ్‌ను తెలుగు హీరోగా ట్రీట్ చేస్తుంటారని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. తెలుగులో బొమ్మరిల్లు (Bommarillu), నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమాలతో సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన బాయ్స్ సినిమాతో సిద్దార్థ్ తొలిసారి హీరోగా సిల్వర్ స్క్రీన్‌పై మెరిసిన విషయం తెలిసిందే.
బాయ్స్ సినిమాతో (Boys) హీరోగా కెరీర్ మొదలుపెట్టి ఇటీవలే సక్సెస్‌ఫుల్‌గా 20 ఏళ్ల మైల్‌స్టోన్‌ను పూర్తి చేసుకున్నాడు సిద్దార్థ్. తాజాగా రొమాంటిక్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన టక్కర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా జరిపిన చిట్ చాట్ సెషన్లో సిద్దార్థ్ ఎమోషనల్ అయిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది.
తమిళ మీడియా సంస్థ సిద్దార్థ్ 20 ఏండ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఫ్యాన్స్ మీట్‌ను ఏర్పాటు చేసింది. ఈ ఈవెంట్‌కు సిద్దార్థ్ జీవితంలో చాలా ముఖ్యమైన వ్యక్తిని సర్ప్రైజ్ గెస్ట్‌గా తీసుకొచ్చారు. ఆమె పేరు సుజాత రంగరాజన్ (Sujatha Rangarajan). ఆమెను చూడగానే ఒక్కసారిగా బావోద్వేగానికి లోనై.. ఏడ్చేశాడు సిద్దార్థ్. అంతేకాదు సుజాత రంగరాజన్‌కు సాష్టాంగ నమస్కారం చేశాడు. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరో తెలుసా..? మణిరత్నం దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన సిద్దార్థ్‌ను యాక్టర్‌గా ఇంట్రడ్యూస్ చేయాలని డైరెక్టర్ శంకర్‌కు రికమండ్ చేసింది ఈమెనే.
‘సిద్దార్థ్ పేరును శంకర్‌కు రికమెండ్ చేయాలని నా భర్తకు సూచించాను. కానీ ఆయన తిరస్కరించాడు. ఆ అబ్బాయి డైరెక్టర్ కావాలనుకుంటున్నాడని అన్నారు. అయితే ఆ పాత్రకు సిద్దార్థ్ పర్ఫెక్ట్గా సెట్ అవుతాడని శంకర్‌కు చెప్పాను. శంకర్ సిద్దార్థ్‌కు కాల్ చేసినప్పుడు మొదట నో చెబుతూ.. తాను డైరెక్టర్ అవ్వాలనుకుంటున్నట్టు చెప్పాడు. ఆ తర్వాత ఓ సారి ఫొటోషూట్‌కు రావాలని సిద్దార్థ్‌ను అడిగాడు శంకర్. మణిరత్నం కూడా ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సిద్దార్థ్‌ను ప్రోత్సహించాడు. ఫైనల్‌గా ఈ ప్రయత్నాలన్నీ సిద్దార్థ్‌ను హీరోగా చేశాయని చెప్పుకొచ్చారు’ సుజాత రంగరాజన్.
చిట్‌చాట్ సెషన్లో సిద్ధార్థ్ కృతజ్ఞతతో సుజాత రంగరాజన్‌ని ప్రేక్షకులకు పరిచయం చేశాడు. శంకర్‌కి తన పేరును సూచించింది ఆమెనే అని తర్వాత తెలుసుకున్నానని చెప్పాడు సిద్ధార్థ్ . ఆ సమయంలో ఆమె మాట్లాడకపోతే తన జీవితం మరో దారిలో ఉండేదని వ్యాఖ్యానించాడు.
సిద్దార్థ్ ఎమోషనల్ వీడియో..
❤️❤️
Sujatha, who recommended Siddharth to Dir shankar for #Boys movie.
— Christopher Kanagaraj (@Chrissuccess) June 8, 2023