Ashika Ranganath | అందం, అభినయ సామర్థ్యం రెండూ దండిగా ఉన్న కథానాయిక అషికా రంగనాథ్. కలిసొచ్చే అదృష్టం కోసం కళ్లలో దీపాలు పెట్టుకొని మరీ ఎదురు చూస్తున్నది ఈ కన్నడ కస్తూరి. సిద్ధార్థ్‌కి జోడీగా ఈ అందాలభామ నటించిన ‘మిస్ యు’ సినిమా ఈ నెల 29న విడుదల కానుంది. ఎన్.రాజశేఖర్ దర్శకత్వంలో సామ్యూల్ నిర్మించిన ఈ చిత్రంపై అషికా ఎంతో ఆశ పెట్టుకున్నది.
ఇటీవల ఈ సినిమా గురించి తను మాట్లాడుతూ ‘ఇందులో నా పేరు సుబ్బులక్ష్మి. సిద్ధార్థ్ పేరు వాసుదేవ్. నేనంటే తనకు అస్సలు పడదు. కానీ.. అనుకోకుండా నా ప్రేమలో పడిపోతాడు. కారణం ఏంటో తెరపైనే చూడాలి.’ అంటూ చెప్పుకొచ్చింది అషికా రంగనాథ్. ఇంకా మాట్లాడుతూ ‘నేను ఎలాంటి పాత్రలనైతే ఇష్టపడతానో.. అలాంటి పాత్ర సుబ్బులక్ష్మి. తను ఇన్నోసెంట్. పక్కా ట్రెడిషనల్. ఓ విధంగా ఇది సుబ్బులక్ష్మి కథే. ఇంతటి మంచి పాత్ర ఇచ్చిన దర్శకుడు రాజశేఖర్‌కీ, హీరో సిద్ధార్థ్‌కీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నా’ అని తెలిపింది అషికా.