గుండెపోటుతో శుక్రవారం చనిపోయిన టీవీ నటుడు సిద్ధాంథ్ వీర్ సుర్యవంశీ అంత్యక్రియులు ఈరోజు ముంబైలో ముగిశాయి. సిద్ధార్థ్ కూతురు డిజా చితికి నిప్పంటించింది. బాలీవుడ్ సెలబ్రిటీలు, అభిమానులు టీవీ నటుడికి కన్నీటి వీడ్కోలు పలికారు. జిమ్‌లో వర్కవుట్ చేస్తుండగా గుండెపోటు రావడంతో సిద్ధాంథ్ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. దాంతో, కుటుంబసభ్యులు అతడిని మధ్యాహ్నం 12ః30కి కోకిలాబెన్ ఆస్పత్రికి తరలించారు. కానీ, అప్పటికే సిద్ధాంథ్ చనిపోయాడని డాక్టర్లు చెప్పారు.
కుసుమ్, కసౌతీ జిందగీ కీ వంటీ టీవీ షోలతో సిద్ధాంథ్ సూర్యవంశీ టీవీ నటుడిగా పాపులర్ అయ్యాడు. 46 ఏళ్ల వయసులోనే సిద్ధాంథ్ చనిపోవడంతో హిందీ టీవీ నటులతో పాటు సినిమాస్టార్లు కూడా దిగ్భ్రాంతికి గురయ్యారు. సిద్ధాంథ్ మొదటి భార్య ఇరా కూడా అంత్యక్రియలకు హాజరైంది. కూతరు డిజా.. సిద్ధాంథ్, ఇరాల మొదటి సంతానం. ఇరాతో విడాకుల అనంతరం అలేసియా రౌత్‌ని పెళ్లి చేసుకున్నాడు. వీళ్లకు ఒక కుమారుడు ఉన్నాడు.