Chithha Movie Teaser | తెలుగు తెరపై బాయ్స్ (Boys), నువ్వొస్తానంటే నేనొద్దంటాన, బొమ్మరిల్లు (Bommarillu), ఓయ్ (OYE), వంటి విజయవంతమైన చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు కథానాయకుడు సిద్ధార్థ్ (Siddarth). ఆయన హీరోగా నటిస్తున్న కొత్త సినిమా చిత్తా (Chithha). ఈ చిత్రాన్ని రెడ్ జెయింట్ మూవీస్ (Red Giant Movies), ఈటాకీ (Eataki entertainments) ఎంటర్టైనమెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. సేతుపతి (Sethupathy) సినిమా ఫేమ్ అరుణ్ కుమార్ (Arun Kumar) దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ నుంచి ఫస్ట్ లుక్ విడుదల చేయగా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. తాజాగా ఈ మూవీ నుంచి మేకర్స్ సాలిడ్ అప్డేట్ ఇచ్చారు.
ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. టీజర్ గమనిస్తే.. కూతురు కోసం ఒక తండ్రి చేసే పోరాటమే ఈ సినిమా అని అర్థమవుతుంది. ఇక ప్రస్తుతం ఈ టీజర్ నెట్టింట వైరల్‌గా మారింది. కాగా ఈ మూవీని సెప్టెంబర్ 28న విడుదల చేయనున్నట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఇక ప్రస్తుతం పోస్టు ప్రోడక్షన్స్ జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలో ప్రమోషన్స్ షూరు చేయనుంది.
#CHITHHA Teaser – looks excellent 👌
A man going the lengths to save a child, interesting plot..
Looks like #Siddharth is back with a winner!
▶️ https://t.co/hoKAQkoDUx@RedGiantMovies_ release on September 28!
— Ramesh Bala (@rameshlaus) September 6, 2023