e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, May 18, 2021
Home News మ‌హా స‌ముద్రం నుండి సిద్ధార్థ్‌ ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌

మ‌హా స‌ముద్రం నుండి సిద్ధార్థ్‌ ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌

మ‌హా స‌ముద్రం నుండి సిద్ధార్థ్‌ ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌

ఆర్ఎక్స్ 100 దర్శకుడు అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన ‘మహా సముద్రం’ చిత్రం ఆగష్టు 19న గ్రాండ్‌గా విడుదల కానున్న విష‌యం తెలిసిందే . లవ్ అండ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంతో టాలీవుడ్‌లో రీ ఎంట్రీ ఇస్తున్నాడు హీరో సిద్ధార్థ్. దాదాపు ఏడేళ్ళ గ్యాప్ తరువాత మళ్లీ ‘మహా సముద్రం’ అంటూ పలకరించబోతున్నాడు సిద్ధార్థ్. ఈ రోజు సిద్ధార్థ్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా మేక‌ర్స్ మూవీ నుండి ఆయ‌న ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేశారు. ఇందులో డీసెంట్ లుక్‌లో క‌నిపిస్తున్నాడు బొమ్మ‌రిల్లు హీరో.

మ‌హా స‌ముద్రం చిత్రంలో అదితిరావు హైదరీ, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై అనిల్‌ సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చైతన్‌ భరద్వాజ్‌ సంగీతం అందిస్తున్నారు. ఎగసిపడే సముద్రపు అలల్లో, మీరు కొలవలేనంత ప్రేమని పరిచయం చేయడానికి వస్తున్నాం.’ అంటూ ‘మహా సముద్రం’ టీమ్ కొద్ది రోజుల క్రితం రిలీజ్ డేట్ పోస్ట‌ర్ విడుద‌ల చేయ‌గా, ఇది ఆక‌ట్టుకుంది. ఈ సినిమాను తెలుగు, త‌మిళ భాషల్లో తెరకెక్కిస్తున్నారు.

Advertisement
మ‌హా స‌ముద్రం నుండి సిద్ధార్థ్‌ ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement