Shweta Basu Prasad | సినీ పరిశ్రమలో అవకాశాలు రావడమే అరుదు. అలాంటిది అవకాశం వస్తే దాన్ని సద్వినియోగం చేసుకుని కెరీర్‌ను చక్కగా ప్లాన్ చేసుకోవాలి. ముఖ్యంగా నటీమణులు విషయంలో ఇది బాగా వర్తిస్తుంది. లేదంటే మొదటికి మోసం వస్తుంది. ప్రస్తుతం అదే పరిస్థితి ఎదుర్కొంటుంది యంగ్ హీరోయిన్ శ్వేత బుసు ప్రసాద్. కొత్త బంగారు లోకం సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ మొదటి సినిమాతో యూత్‌లో విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంది. ఈ సినిమా బ్లాక్‌బస్టర్ విజయం సాధించడంతో ఆమె అవకాశాలు క్యూ కట్టాయి. అవకాశాలు వస్తున్నాయి కదా అని పాత్ర గురించి ఆలోచించకుండా వరుసగా సినిమాలు చేసింది. అవికాస్త ఫ్లాపులుగా మిగిలాయి. దాంతో కొంచెం కొంచెంగా క్రేజ్ తగ్గుతూ వచ్చింది. ప్రస్తుతం ఈ అమ్మడు బాలీవుడ్లో పలు వెబ్‌సిరీస్‌లు, సీరియల్స్‌లో నటిస్తుంది.
ఇదిలా ఉంటే తాజాగా ఈ అమ్మడు తన బర్త్‌డేను సెలబ్రేట్ చేసుకుంది. బర్త్‌డే సందర్భంగా దిగిన కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అవి చూసిన ప్రేక్షకులు షాక్ అవుతున్నారు. శ్వేత బసు ప్రసాద్ ఏంటీ ఇంతలా మారిపోయింది. కొత్త బంగారు లోకంలో చబ్బీగా కనిపించిన ఈ అమ్మడు ఇప్పుడేంటి ఇలా తయారయిందని కామెంట్స్ చేస్తున్నారు. ఇక కెరీర్ పరంగానే కదా పర్సనల్ లైఫ్‌లోనూ ఎన్నో ఒడిదుడుకులను ఈ బ్యూటీ ఎదుర్కొంది. 2018లో డైరెక్టర్ రోహిత్ మిట్టల్‌ను పెళ్లాడగా, విభేదాల కారణంగా ఏడాదిలోపే విడాకులు తీసుకుంది.