Samantha | టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఈ మధ్య సినిమాలు కాస్త తగ్గించింది. మయోసైటిస్ వలన రెండేళ్ల పాటు సినిమాలకి బ్రేక్ ఇచ్చిన సామ్ ఇప్పుడు మళ్లీ వాటిపై ఫోకస్ పెట్టింది. ఎట్టకేలకి సమంత నటిగాను, నిర్మాతగాను అలరించేందుకు సిద్ధమైంది. సమంత నటిస్తూ నిర్మించిన శుభం చిత్రం మే 9న విడుదల కానుండగా, ప్రస్తుతం మూవీ ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి.ఈ క్రమంలోనే తాజాగా ట్రైలర్ విడుదల చేశారు. ఈ ట్రైలర్‌తో కథ ఏంటో సింపుల్‌గా చెప్పే ప్రయత్నం చేశారు. ఊర్లోని మహిళలంతా రాత్రి 9 గంటలకు ప్రసారం అయ్యే సీరియల్‌కు అతుక్కు పోతుంటారు. అలా చూస్తూ దెయ్యాల్లా మారిపోతారు. ఇక ఇంట్లో మగాళ్లకి రక్షణ కరువు అవుతున్న సమయంలో ఓ మాతగా సమంత కనిపిస్తుంది.
మాత సమంత వారిని ఎలా రక్షిస్తుంది? అసలు మహిళలంతా అలా ఎందుకు వింతగా ప్రవర్తిస్తారు? అన్న పాయింట్లే సినిమాలో చూపించబోతున్నట్టు ట్రైలర్‌ని చూస్తే అర్ధమవుతుంది. సమంత డిఫరెంట్ రోల్లో దెయ్యాలను వదిలించే మాతగా కనిపించడం, భర్తలందరూ తమ భార్యలు దెయ్యాలుగా మారడాన్ని తట్టుకోలేక.. ఆవిడ దగ్గరకు వెళ్లి ‘మాతా.. ఇప్పుడు మా అందరికీ ఏం జరగబోతోంది?’ అని ప్రశ్నించడం, సమంత సైగలతో చేసే ఎక్స్ప్రెషన్స్ అయితే మూవీపై ఆసక్తిని పెంచాయి.
పెద్ద క్యాస్టింగ్ లేకుండా దాదాపు అందరూ కొత్తగా వాళ్ళతో తెరకెక్కిన ఈ కామెడీ ఎంటర్ టైనర్ లో వెరైటీ పాయింట్ తీసుకోవడం ప్రేక్షకులలో ఆసక్తిని కలిగించింది. ప్రవీణ కండ్రేగుల దర్శకత్వం వహించిన ఈ చిత్రం మంచి హిట్ అవుతుందని అంటున్నారు. సమంతది ప్రాధాన్యం కలిగిన గెస్టు రోల్ గా కనిపిస్తోంది. సస్పెన్స్ లో పెట్టకుండా ఆమె క్యారెక్టర్ ని రివీల్ చేయడం ద్వారా ఫ్యాన్స్ కు ముందే హింట్ ఇచ్చారు. షోర్ పోలీస్ సంగీతం సమకూరుస్తున్న శుభంకు మొత్తం యూత్ టాలెంట్ పని చేశారు. సమంత సమర్పణలో ట్రా లా లా మూవింగ్ పిక్చర్స్ మీద శుభం అనే సినిమా రాబోతోంది. రాజ్ నిడుమోరి క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా ఈ సినిమాకు వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా హిట్ అయితే సమంత మళ్లీ గాడిలో పడుతుందని అంటున్నారు