అందాల ముద్దుగుమ్మ శ్రియ ఈ మధ్య సినిమాల కన్నా సోషల్ మీడియాలో తెగ హంగామా చేస్తుంది. తన భర్తతో కలిసి టూర్స్ వేయడం అక్కడ ఆయనతో కలిసి ఆట పాటలు, ముద్దు ముచ్చట్లు ఇలా ఒకటేంటి శ్రియ హంగామా శృతి మించిపోతుంది. ఈ అమ్మడి రచ్చ చూసి అభిమానులే షాక్ అవుతున్నారు. ముఖ్యంగా పెళ్లికి ముందు కంటే పెళ్లి తర్వాతనే తన అందచందాలతో ఇంటర్నెట్ను షేక్ చేస్తోంది.
పబ్లిక్‌లోనే రొమాన్స్ చేస్తూ అందుకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది. ఆ మధ్య ఓ బోటులో శ్రియ తన భర్త ఆండ్రీ కోస్చీవ్ చేసిన రచ్చకు అంతా షాక్ అయ్యారు. ఇక తాజాగా ముద్దుల్లో మునిగింది ఈ ముద్దుగుమ్మ. అందమైన ప్లేస్‌లో శ్రియ ఓ పాట పాడుతుండగా, దానికిఇ ఆమె భర్త హుషారుగా స్టెప్పులు వేసాడు.ఆ తర్వాత ఇద్దరు పెద్దాలపై ముద్దులు పెట్టుకొని ఔరా అనిపించారు.
శ్రియ ఖాతాలో పెద్దగా సినిమాలేవి లేవు. రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తుంది. శ్రియ షూటింగ్ ఇప్పటికే పూర్తి కాగా, త్వరలో ఆమె ఫస్ట్ లుక్ విడుదల కానున్నట్టు తెలుస్తుంది.ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని రాజమౌళి పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిస్తుండగా, ఈ సినిమాతో శ్రియకి కూడా పాపులారిటీ వస్తుందని ఆమె అభిమానులు భావిస్తున్నారు.