Shraddha Srinath | టాలీవుడ్లో గత నాలుగు దశాబ్దాలుగా తెలుగు ప్రేక్షకులలో ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియెన్స్‌లో తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్నాడు వెంకీ మామ. ఇటీవల రానా నాయుడు వెబ్-సిరీస్‌తో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న వెంకీ ప్రస్తుతం ఆ మచ్చను పొగొట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక వెంకటేష్ ప్రస్తుతం హిట్ సిరీస్ ఫేమ్ సలైష్ కొలను దర్శకత్వంలో సైంధవ్ అనే యాక్షణ్ థ్రిల్లర్ సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే రిలీజైన టీజర్, ట్రైలర్లు సినిమాపై ఎక్కడలేని అంచనాలు క్రియేట్ చేశాయి. కాగా తాజాగా ఈ సినిమాలోని హీరోయిన్ ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు.
ఈ సినిమాలో జెర్సీ ఫేమ్ శ్రద్దా శ్రీనాథ్ హీరోయిన్గా నటిస్తుంది. తాజాగా ఈమె ఫస్ట్‌లుక్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ఈ మూవీలో శ్రద్దా ‘మనోజ్ఞ’ పాత్రలో కనిపించింది. పోస్టర్లో శ్రద్ధా ఓ ట్యాక్సీలో కూర్చుని అన్నం తింటూ కనిపించింది. నవాజుద్దిన్ సిద్ధిఖీ కీలకపాత్ర పోషిస్తున్న ఈ సినిమాను నిహారిక ఎంటర్టైనమెంట్ బ్యానర్‌పై వెంకట్ బోయన్‌పల్లి నిర్మిస్తున్నాడు. ఈ సినిమాను పాన్ ఇండియా లెవల్లో క్రిస్మస్ కానుకుగా జనవరి 22న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు చిత్రబృందం ఇటీవల ప్రకటించింది.
A super talented actress, who melts everyone with her performances!!💥
Team #SAINDHAV welcomes aboard the stunning actress @ShraddhaSrinath as ‘MANOGNYA’ ❤️🔥
Victory @VenkyMama @Nawazuddin_S @KolanuSailesh @vboyanapalli @Music_Santhosh @tkishore555 #Venky75 pic.twitter.com/e2hOzwyC60
— Niharika Entertainment (@NiharikaEnt) April 15, 2023