Shraddha Kapoor | బాలీవుడ్ వెండితెరపై హిట్ పెయిర్ శ్రద్ధాకపూర్, వరుణ్ ధావన్. వీళ్లద్దరికీ చిన్నప్పటి నుంచి అనుబంధం ఉంది. ఒకే స్కూల్లో చదివారు కూడా! ఈ ఇద్దరి సాన్నిహిత్యం చూసి ఎప్పటికైనా జట్టుకడతారనే వార్తలూ చాలాసార్లు వినిపించాయి. అయితే వరుణ్ తన స్నేహితురాలు నటాషా దలాల్‌ను పెండ్లి చేసుకోవడంతో ఈ పుకార్లకు తెరపడింది. అయితే, ఇటీవల ఒక ఇంటర్వ్యూలో వరుణ్‌కు తాను ప్రపోజ్ చేశానంటూ శ్రద్ధా చేసిన కామెంట్లు వైరల్ అయ్యాయి.
ఇంతకీ ఆమె ఆ ఇంటర్వ్యూలో ఏం చెప్పిందంటే.. ‘చిన్నప్పటి నుంచి వరుణ్ నా బెస్ట్ ఫ్రెండ్. అతణ్ని బాగా ఇష్టపడేదాన్ని. ఓ రోజు నేరుగా తనకు ప్రపోజ్ చేశాను. వెంటనే పరుగు లంఘించుకున్నాడు. అప్పుడు నా వయసు ఎంతనుకున్నారు? జస్ట్ ఎనిమిదేండ్లే! ‘యూ.. లవ్.. ఐ’ అనగానే వరుణ్‌కు ఏం చెప్పాలో తెలియక ‘నో..’ అని పారిపోయాడు పాపం’ అంటూ చిన్ననాటి జ్ఞాపకాన్ని నెమరువేసుకుంది.