Shraddha Kapoor | బాలీవుడ్ అందాల తార శ్రద్ధా కపూర్ ప్రస్తుతం మంచి జోష్‌లో ఉన్నారు. తాజాగా ఆమె నటించిన ‘స్త్రీ2’ సినిమా మంచి విజయాన్ని అందుకున్నది. బాలీవుడ్లో ప్రతి ఒక్కరూ షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్, ఆమిర్ ఖాన్‌తో నటించాలని కోరుకుంటారు. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి చాలా సంవత్సరాలు గడిచినప్పటికీ ఖాన్ త్రయంతో ఒక్క సినిమా కూడా చేయలేదు శ్రద్ధ. దానికి కారణం ఏమిటనే దానిపై చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి.
‘స్టార్ హీరోల సినిమాల్లో నటించడం కంటే నా క్యారెక్టర్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని అనుకుంటాను. గతంలోనే నాకు వారి సినిమాల్లో నటించే ఆఫర్లు వచ్చాయి. నా పాత్రకు ప్రాధాన్యం లేదనే వాటిని తిరస్కరించాను. ఖాన్ త్రయంతో ఎందుకు నటించలేదనే ప్రశ్న ఎదురైతే ఇదే నా సమాధానం. సినిమాల ఎంపికలో జాగ్రత్తగా ఉంటాను.
నాలోని నటికి ఆ క్యారెక్టర్ సరిపోతుందా..? సవాలుగా ఉంటుందా..? అనే విషయాలను పరిగణనలోకి తీసుకుంటాను. నా పాత్రకు ప్రాధాన్యం లేదని అనిపిస్తే.. అందులో హీరో ఎవరున్నా.. అంగీకరించను’ అని చెప్పుకొచ్చింది శ్రద్ధా కపూర్. తాజాగా విడుదలైన ‘స్త్రీ2’ సినిమా ఇప్పటివరకు రూ.300 కోట్లు వసూలు చేసి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. 2018లో వచ్చిన హిట్ సినిమా ‘స్త్రీ’కి సీక్వెల్‌గా ఇది తెరకెక్కింది.