Game Changer | ఏళ్ల తరబడి చిత్రీకరణ జరుపుకుంటున్న ‘గేమ్‌చేంజర్’ సినిమా షూటింగ్ ముగింపుదశకు చేరుకున్నట్టు తెలుస్తున్నది. రీసెంట్గా వైజాగ్‌లో కీలక షెడ్యూల్‌ని పూర్తి చేసిన దర్శకుడు శంకర్, హైదరాబాద్‌లో కొత్త షెడ్యూల్‌కి తెరలేపారు. హైదరాబాద్ ఏవీఎన్ ఇంజనీరింగ్ కళాశాలలో ఈ షెడ్యూల్లోని కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారు శంకర్. ప్రధానతారాగణం ఈ షెడ్యూల్లో పాల్గొననున్నారట.
మే వరకూ జరిగే ఈ షెడ్యూల్‌తో చిత్రీకరణ పూర్తవుతుందని యూనిట్‌వర్గాల సమాచారం. ఈ సినిమా విడుదల తేదీని కూడా మే నెలలోనే నిర్మాత దిల్‌రాజు ప్రకటించనున్నారట. పోస్ట్‌ప్రొడక్షన్‌కు శంకర్ ఎక్కువ సమయం తీసుకుంటారన్న విషయం తెలిసిందే. జనవరిలో చిరంజీవి ‘విశ్వంభర’ విడుదల తేదీ ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో ‘గేమ్‌చేంజర్’ డిసెంబర్లో విడుదల కావొచ్చనేది ఫిల్మ్‌వర్గాల టాక్. రామ్‌చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ చిత్రంలో అంజలి, శ్రీకాంత్, ఎస్.జె.సూర్య, సునీల్ తదితరులు ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి సంగీతం: తమన్.