OG | అగ్ర హీరో పవన్‌కల్యాణ్ ఏపీ పాలిటిక్స్‌లో బిజీగా ఉండటం వల్ల.. ఆయన ముందుగా ఒప్పుకున్న సినిమాలు ఆలస్యం అవుతూవచ్చాయి. వాటిల్లో ఒకటైన ‘హరిహరవీరమల్లు’ సినిమా షూటింగ్‌ని ఇటీవలే పూర్తి చేసిన పవన్‌కల్యాణ్… ఇప్పుడు ‘ఓజీ’ సెట్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ విషయాన్ని ఆ చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించలేదు కానీ.. ‘మళ్లీ మొదలైంది.. ఈసారి ముగిద్దాం..’ అనే క్యాప్షన్‌ని తమ సోషల్ మీడియాలో పోస్ట్ చేసి పవర్‌స్టార్ అభిమానులకు శుభవార్త పాస్ చేసింది. అలాగే ఈ షెడ్యూల్లోనే చిత్రీకరణ పూర్తి చేయనున్నట్టు హింట్ కూడా ఇచ్చారు.
షూటింగ్‌కి సంబంధించిన ఫొటోను కూడా పోస్ట్‌లో జత చేశారు. సుజిత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ గ్యాంగ్ స్టర్ యాక్షన్ థ్రిల్లర్‌లో పవన్‌కల్యాణ్ సరసన ప్రియాంక మోహన్ నటిస్తున్నారు. బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ ఇందులో విలన్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే. డీవీవీ ఎంటైర్టెన్మెంట్స్ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: రవి కె.చంద్రన్, సంగీతం: ఎస్.థమన్.