పవన్‌కల్యాణ్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఓజీ’ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్నది. సుజీత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని డీవీవీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో పవన్‌కల్యాణ్ ైస్టెలిష్ గ్యాంగ్‌స్టర్ పాత్రలో కనిపించబోతున్నట్లు తెలిసింది. ‘ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్’ వర్కింగ్ టైటిల్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అయితే అదే టైటిల్‌ను సినిమాకు ఖరారు చేయబోతున్నారని సమాచారం.
గురువారం ఈ చిత్రానికి సంబంధించిన తాజా అప్డేట్ను నిర్మాణ సంస్థ సోషల్‌మీడియా ద్వారా పంచుకుంది. సెప్టెంబర్ 2న ఇంట్రెస్టింగ్ న్యూస్‌ను వెల్లడించబోతున్నట్లు ప్రకటించింది. ఆ రోజు పవన్‌కల్యాణ్ జన్మదినం కావడంతో టీజర్‌ను రిలీజ్ చేస్తారని అభిమానులు భావిస్తున్నారు. గ్యాంగ్‌స్టర్ నేపథ్య కథాంశంతో యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇమ్రాన్ హష్మీ, ప్రకాష్ రాజ్, అర్జున్‌దాస్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతాన్నందిస్తున్నారు.