Adipurush Movie | ఆదిపురుష్ నుంచి శివోహం వీడియో సాంగ్ రిలీజ్
Shivoham Song | ఆదిపురుష్ రెండో వారంలోకి అడుగుపెట్టింది. ట్రైలర్, పాటలతో ఎంతెంత పాజిటీవిటీ సంపాదించుకుందో రిలీజయ్యాకా అంతకంటే ఎక్కువ నెగెటివిటీని ఎదుర్కొంటుంది. ఇప్పటివరకు ఈ సినిమాకు ఒక్క పాజిటీవ్ రివ్యూ వస్తే ఒట్టు.
Shivoham Song | ఆదిపురుష్ రెండో వారంలోకి అడుగుపెట్టింది. ట్రైలర్, పాటలతో ఎంతెంత పాజిటీవిటీ సంపాదించుకుందో రిలీజయ్యాకా అంతకంటే ఎక్కువ నెగెటివిటీని ఎదుర్కొంటుంది. ఇప్పటివరకు ఈ సినిమాకు ఒక్క పాజిటీవ్ రివ్యూ వస్తే ఒట్టు. సినిమా కథ, క్యారెక్టర్లు వాస్తవ రామాయణానికి భిన్నంగా ఉన్నాయని పలువురు మండిపడుతున్నారు. దానికి తోడు డైలాగ్ రైటర్ ముంతాషిర్ శుక్లా పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తుండటం పుండు మీద కారం చల్లినట్లు అయింది. కలెక్షన్లు కూడా దిబేల్మని పడిపోయాయి. తొలిమూడు రోజుల్లో ముడొందల కోట్లకు పైగా కలెక్షన్లు సాధిస్తే.. ఆ తర్వాతి ఏడురోజుల్లో వంద కోట్ల కలెక్షన్లు మాత్రమే సాధించింది.
రిజల్ట్ సంగతి అంటుంచితే ఆదిపురుష్లో కాస్తో కూస్తో జనాలను ఆకట్టుకుంది మాత్రం సంగీతమే. ఒక్కో పాట ఒక్కో ఆణిముత్యం. అంతేకాకుండా పాటలను ఓంరౌత్ అద్భుతంగా తెరకెక్కించాడు. ముఖ్యంగా ఈ సినిమాలోని శివోహం పాటను థియేటర్లో చూస్తే గూస్బంప్స్ వచ్చాయి. సైఫ్ అలీఖాన్ శివలింగం ముందు కూర్చొని వీణ వాయిస్తుంటే వేరే లెవల్ అనిపించింది. ఇక ఈ పాటలో సైఫ్ రూపంలో ఉన్న శిల్పాలు పెదవులు కల్పడం, కళ్లు చమర్చడం వినూత్నంగా అనిపించాయి. అజయ్-అతుల్ స్వర పరిచిన ఈ పాటను హరిచరణ్ ఆలపించాడు.
ఓం రౌత్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ప్రభాస్ రాముడి పాత్రలో కనిపించగా.. కృతిసనన్ సీత పాత్ర పోషించింది. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ లంకాధిపతి రావణాసురుడు పాత్ర పోషించాడు. రెట్రో ఫైల్స్, టీ సిరీస్ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాను తెలుగులో పీపుల్ మీడియా సంస్థ రిలీజ్ చేసింది. ఇక ఇప్పటివరకు ఈ సినిమా నాలుగొందల యాభై కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. బ్రేక్ ఈవెన్ కావాలంటే మరో వంద కోట్ల గ్రాస్ సాధించాల్సి ఉంటుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

