Shivaraj kumar | గత ఏడాది సప్త సాగరాలు దాటి సినిమాలతో బ్లాక్ బస్టర్లు అందుకున్నాడు దర్శకుడు హేమంత్ రావు (Hemanth Rao). 2023లో కన్నడ నుంచి వచ్చిన ఈ సినిమాలు తెలుగుతో పాటు సౌత్ ప్రేక్షకుల మనసు దోచుకుంది. రక్షిత్ శెట్టి హీరోగా నటించిన ఈ చిత్రంలో రుక్మిణి (Rukmini) కథానాయికగా నటించింది. ఇక ఈ సినిమా అనంతరం తన తదుపరి ప్రాజెక్ట్‌ను అనౌన్స్ చేశాడు హేమంత్ రావు . కన్నడ చక్రవర్తి డాక్టర్ శివరాజ్ కుమార్ (Shivaraj kumar) హీరోగా హేమంత్ రావు తన నెక్స్ట్ ప్రాజెక్ట్ చేయబోతున్నాడు. ఇక ఈ సినిమా ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్గా రాబోతున్నట్లు సమాచారం. జె.ఫిల్మ్స్ పతాకంపై వైశాక్ గౌడ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
ఇక గోధి బన్న సాధారణ మైకట్టు (Godhi Banna sadharana Maikattu), కవలుదారి Kavaludhari (తెలుగులో కపటధారి), భీమ సేన నల మహారాజు (Bheema Sena Nala Maharaju), సప్త సాగరాలు దాటి (Sapta sagaralu Daati) లాంటి డిఫరెంట్ జానర్లు తర్వాత హేమంత్ రావు యాక్షన్ సినిమా చేయనుండడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది.
Incredibly honoured to be working on my 5th film with the legend Dr. Shivarajkumar. I have always made every film like it is my first and last film; extremely excited to go on this journey with #VaishakJGowda @NimmaShivanna @Vaishak_J_Films pic.twitter.com/UZZNqf3Hbu
— Hemanth M Rao (@hemanthrao11) February 1, 2024