Shivaraj kumar | సప్త సాగరాలు దాటి సినిమా దర్శకుడు హేమంత్ రావు (Hemanth Rao) కొత్త సినిమాను ప్రారంభించాడు. కన్నడ చక్రవర్తి శివరాజ్‌కుమార్‌తో ఒక సినిమాను తెరకెక్కిస్తున్నాడు. 666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ (666 Operation Dream Theater) అనే టైటిల్‌తో రాబోతున్న ఈ చిత్రంలో పుష్ప చిత్రంలో అలరించిన నటుడు డాలీ ధనుంజయ కీలక పాత్రల్లో నటిస్తుండగా.. జె.ఫిల్మ్స్ పతాకంపై వైశాక్ గౌడ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇటీవలే పూజ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇదిలావుంటే తాజాగా ఈ మూవీ నుంచి శివరాజ్ కుమార్ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసింది చిత్రబృందం. ఈ లుక్‌లో శివన్న గన్ పట్టుకుని గుఢచారి లుక్‌లో కనిపిస్తున్నాడు.
సప్త సాగరాలు దాటి (Sapta sagaralu Daati) లాంటి డిఫరెంట్ జానర్లు తర్వాత హేమంత్ రావు యాక్షన్ సినిమా చేయనుండడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.
ಡ್ರೀಮ್ ಥಿಯೇಟರ್ಗೆ ಒಬ್ನೇ ರಾಜ!! 👑
Unveiling The First Look Of @NimmaShivanna from my next #666OperationDreamTheatre. #King #666ODT pic.twitter.com/lvYR4rlI5x
— Hemanth M Rao (@hemanthrao11) July 9, 2025