Captain Miller | కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ (Dhanush) ఫ్యాన్స్ ఎక్జయిటింగ్‌గా ఎదురుచూస్తున్న సినిమా కెప్టెన్ మిల్లర్ (Captain Miller). అరుణ్ మథేశ్వరన్ డైరెక్ట్ చేస్తున్నాడు. యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో వస్తోన్న ఈ మూవీ టీజర్‌ను ధనుష్ బర్త్ డే సందర్భంగా జులై 28న లాంఛ్ చేయనున్నట్టు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. ఈ మూవీలో కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ (Shivarajkumar) కీలక పాత్రలో నటిస్తున్నాడని తెలిసిందే. తాజాగా ధనుష్‌కు అడ్వాన్స్ బర్త్ డే విషెస్ అందించాడు స్టార్ హీరో శివరాజ్ కుమార్.
ఇవాళ మిడ్ నైట్ 12:01 గంటలకు టీజర్ విడులవుతుంది. ధనుష్‌కు అడ్వాన్స్‌గా పుట్టినరోజు శుభాకాంక్షలు. కెప్టెన్ మిల్లర్ టీంకు ఆల్ ది బెస్ట్. టీజర్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని వీడియో సందేశాన్ని ట్విట్టర్లో పోస్ట్ చేశాడు ఇప్పుడీ వీడియో నెట్టింట్లో ట్రెండింగ్ అవుతోంది. కెప్టెన్ మిల్లర్ చిత్రంలో కోలీవుడ్ భామ ప్రియాంక అరుళ్ మోహన్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. టాలీవుడ్ నటుడు సందీప్ కిషన్, నివేదితా సతీశ్, అమెరికన్ యాక్టర్, ఆర్ఆర్ఆర్ ఫేం ఎడ్వర్డ్ సొన్నెన్‌బ్లిక్ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. జీవీ ప్రకాశ్ కుమార్ ఈ మూవీకి సంగీతం అందిస్తున్నాడు.
సత్య జ్యోతి ఫిలిమ్స్ తెరకెక్కిస్తున్న కెప్టెన్ మిల్లర్ తెలుగు, తమిళం, హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఇప్పటికే మేకర్స్ లాంఛ్ చేసిన కెప్టెన్ మిల్లర్ లుక్స్ నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. కెప్టెన్ మిల్లర్ ఆడియో రైట్స్‌ను పాపులర్ మ్యూజిక్ లేబుల్ సరిగమ సొంతం చేసుకుంది. కెప్టెన్ మిల్లర్ ఆడియో రైట్స్‌ను సరిగమ భారీ మొత్తానికి దక్కించుకున్నట్టు సమాచారం. విప్లవయోధుడు కెప్టెన్ మిల్లర్ స్పూర్తితో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మూడు పార్టులుగా తెరకెక్కించనున్నట్టు వార్తలు వస్తుండగా.. దీనిపై మేకర్స్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.
ధనుష్ స్వీయ దర్శకత్వంలో డీ50వ (D50) సినిమా చేస్తుండగా.. D50 షూటింగ్ ఇటీవలే షురూ అయింది. ధనుష్ ఇందులో గ్యాంగ్‌స్టర్‌గా కనిపించబోతున్నట్టు ఇన్సైడ్ టాక్. ఈ చిత్రంలో కాళిదాస్, దుషారా విజయన్ కీ రోల్స్ లో నటిస్తున్నారు. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. ధనుష్ హిందీలో Tere Ishk Meinలో నటిస్తున్నాడు. మరోవైపు ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వంలో మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఆనంద్ ఎల్ రాయ్, ధనుష్ కాంబోలో రాబోతున్న మూడో సినిమా ఇది.
Captain Miller Teaser Releasing Tonight at 12:01AM. Wishing @dhanushkraja a very Happy Birthday in advance.
All the very best to the team and looking forward to the teaser.#CaptainMiller #CaptainMillerTeaser @ArunMatheswaran @sundeepkishan @gvprakash @priyankaamohan… pic.twitter.com/xZ9jrm7dKT— DrShivaRajkumar (@NimmaShivanna) July 27, 2023