Shivani Rajasekhar New Film | ఆంగ్రీమ్యాన్ రాజశేఖర్ గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అంకుశం, అల్లరి ప్రియుడు, సింహరాశి వంటి ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలలో నటించి ఫ్యామిలీ హీరోగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈయన ఇద్దరు కుమార్తెలు సినిమాల్లో రాణిస్తున్నారు. రాజశేఖర్ పెద్ద కూతురు శివాని ‘అద్భుతం’ సినిమాతో సినీరంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతోనే తన యాక్టింగ్‌తో ప్రేక్షకులను కట్టి పడేసింది. ఆ తర్వాత ‘WWW’ అనే థ్రిల్లర్ చేసింది. ఈ సినిమాలో తన నటనకు గొప్ప ప్రశంసలు దక్కాయి. ఈ ఏడాది అన్బరివు చిత్రంతో తమిళంలో కూడా ఎంట్రీ ఇచ్చింది. ఇదిలా ఉంటే ఈమె తాజాగా టాలీవుడ్ బిగ్ ప్రొడక్షన్ హౌజ్‌లో సినిమా చేస్తుంది.
టాలీవుడ్ బిగ్ ప్రోడక్షన్ సంస్థలతో ‘జీఏ-2 పిక్చర్స్’ ఒకటి. ఈ సంస్థ నుండి సినిమా వస్తుందంటే మినిమం గ్యారెంటీ అనే విధంగా ఉంటుంది. తాజాగా శివాని గీతాఆర్ట్స్-2 లో తన కొత్త సినిమాను ప్రారంభించింది. రాహుల్‌విజయ్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి తేజ మర్ని దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా ఈ చిత్రం హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలను జరుపుకుంది. అల్లుఅరవింద్ ముహూర్తం సన్నివేశానికి క్లాప్ కొట్టాడు. గీతాఆర్ట్స్ సమర్పణలో జీఏ-2 పిక్చర్స్ బ్యానర్‌పై బన్నీవాసు, విద్య మాధురి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో శ్రీకాంత్, వరలక్ష్మీ శరత్ కుమార్‌లు కీలకపాత్రల్లో నటిస్తున్నారు.
#AlluAravind Presents @GA2Official's #ProductionNo8 launched today with a pooja ceremony.✨
Produced by #BunnyVas & #VidhyaMadhuri
Directed by #TejaMarni @actorsrikanth @varusarath5 @ActorRahulVijay #ShivaniRajasekhar @murlisharma72 @shakthikanth @dopjagadeesh #BhanuPratapa pic.twitter.com/ht2DprRjy9— GA2 Pictures (@GA2Official) June 30, 2022