శివాజీ, నవదీప్, నందు, రవికృష్ణ, మానికా చిక్కాల, మౌనికా రెడ్డి, బిందుమాధవి, రాధ్య, అదితి భావరాజు ముఖ్య పాత్రలు పోషించిన సందేశాత్మక చిత్రం ‘దండోరా’. మురళీకాంత్ దర్శకుడు. రవీంద్ర బెనర్జీ ముప్పానేని నిర్మాత. ఈ నెల 25న సినిమా విడుదల కానున్నది. మైత్రీమూవీమేకర్స్ ఈ చిత్రాన్ని నైజాంలో విడుదల చేస్తున్నది. ఓవర్సీస్లో 200 థియేటర్లకు పైగా సినిమాను విడుదల చేస్తున్నామని, అలాగే.. అక్కడ ఈ నెల 23న ప్రీమియర్స్ కూడా పడనున్నాయని మేకర్స్ తెలిపారు.
ఈ నేపథ్యంలో శుక్రవారం ఈ సినిమా ట్రైలర్‌ని విడుదల చేశారు. ట్రైలర్‌ని గమనిస్తే.. ఊరి బయట కొందరు శవాన్ని మోసుకెళ్తున్నారు. ఇంతదూరం శవాన్ని ఎందుకు మోసుకురావాలి? అని వారితో ఓ పిల్లాడు అడుగుతాడు. ‘మన చావు పుట్టుకలన్నీ ఈ ఊరి బయట రాసిండ్రా ఆ దేవుడు..’ అని ఓ మోసేవారిలో ఓ వ్యక్తి ఇచ్చే సమాధానం ఆలోచింపజేసేలా ఉంది. గ్రామీణ తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టేలా సినిమా తెరకెక్కిందని ట్రైలర్ చెబుతున్నది. ఈ సినిమాకు సంగీతం: మార్క్ కె.రాబిన్.