Shine Tom Chacko | టాలీవుడ్ హీరో నాని (Nani) నటించిన పక్కా మాస్ ఎంటర్టైనర్ దసరా (Dasara). ఈ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు మలయాళీ నటుడు షైన్ టామ్ చాకో (Shine Tom Chacko).. ఆ తరువాత నాగశౌర్య నటించిన రంగబలిలో తన విలనిజంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక షైన్ టామ్ చాకో నటిస్తున్న లేటెస్ట్ మూవీ మహారాణి (Maharani). రోషన్ మాథ్యూ (Roshan Mathew) ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు.
ఈ చిత్రానికి జి మార్తాండన్ (G Marthandan) దర్శకత్వం వహిస్తుండగా.. ఎస్బి ఫిలింస్ (SB Films) బ్యానర్‌పై సుజిత్ బాలన్ నిర్మిస్తున్నారు. NM బాదుషా సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి మేకర్స్ మోషన్ పోస్టర్‌తో పాటు ఫస్ట్ లుక్ విడుదల చేయగా ప్రేక్షకుల నుంచి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించి మేకర్స్ రిలీజ్ అప్డేట్ ప్రకటించారు.
ఈ సినిమాను నవంబర్ 24న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు మేకర్స్ సోషల్ మీడియాలో తెలిపారు. కామెడీ బ్యాక్‌డ్రాప్‌లో రానున్న ఈ మూవీలో బాలు వర్గీస్, హరిశ్రీ అశోకన్, జాఫర్ ఇడుక్కి, గోకులన్, కైలాష్, అశ్వత్ లాల్, అప్పున్ని శశి, ఉన్ని లాలు, ఆదిల్ ఇబ్రహీం, రఘునాథ్ పలేరి, ప్రమోద్ పలేరి, ప్రమోద్ పలేరి, సారంగ్, స్మిను సిజో, శృతి జయన్, గౌరీ గోపన్, ప్రియా కొట్టాయం, సంధ్య మనోజ్ తదితరలు కీలక పాత్రలు పోషిస్తున్నారు.