Shilpa Shetty | షిర్డీ సాయిబాబాను దర్శించుకున్న శిల్పాశెట్టి దంపతులు.. సినిమా హిట్ అవ్వాలని..!
Shilpa Shetty | బాలీవుడ్ నటి శిల్పాశెట్టి, రాజ్‌కుంద్రా దంపతులు సోమవారం షిర్డీ సాయిబాబాను దర్శించుకున్నారు. సాయిబాబా సమాధిని సందర్శించి, మధ్యాహ్నం హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు.
Shilpa Shetty | బాలీవుడ్ నటి శిల్పాశెట్టి, రాజ్‌కుంద్రా దంపతులు సోమవారం షిర్డీ సాయిబాబాను దర్శించుకున్నారు. సాయిబాబా సమాధిని సందర్శించి, మధ్యాహ్నం హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. షిర్డీతో పాటు ద్వారకామాయి, గురుస్థాన్ ఆలయాన్ని ఆలయాలను శిల్పాశెట్టి దంపతులు సందర్శించారు. ఈ సందర్భంగా శిల్పాశెట్టి మీడియాతో మాట్లాడుతూ.. తాను సాయిబాబా భక్తురాలినని.. ఈ విషయం అందరికీ తెలుసునన్నారు. తరుచుగా సాయిబాబా ఆశీస్సుల కోసం షిర్డీకి తరుచుగా వస్తుంటానని పేర్కొంది.
రాజ్‌కుంద్రాతో కలిసి నిర్మించిన ‘సుఖీ’ చిత్రం ఈ నెల 22న విడుదలకానున్నది. చిత్రం పోస్టర్‌ను బాబా పాదాల వద్ద ఉంచి సినిమా హిట్ అవ్వాలని బాబాను కోరుకున్నట్లు శిల్పాశెట్టి చెప్పింది. మంగళవారం నుంచి ‘సుఖీ’ సినిమా ప్రమోషన్స్‌ను ప్రారంభించనున్నట్లు శిల్పాశెట్టి పేర్కొంది. ఈ సందర్భంగా శిల్పాశెట్టి.. రాజ్‌కుంద్రాను షిర్డీ సంస్థాన్ ట్రస్టు శాలువాతో సత్కరించింది. శిల్పాశెట్టి నటించిన ‘సుఖీ’ చిత్రానికి.. సోనాల్ జోషి దర్శకత్వం వహించారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

