ముంబై : బాలీవుడ్ నటి షెహనాజ్ గిల్ (Shehnaaz Gill) ఇన్ఫెక్షన్తో బాధపడుతూ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఇటీవల భూమి పెడ్నేకర్, డాలీ సింగ్, కుషా కపిల, శిబానీ బేడీలతో కలిసి షెహనాజ్ నటించిన థ్యాంక్యూ ఫర్ కమింగ్ విజయవంతమైంది. ముంబైలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న షెహనాజ్ గిల్‌ను నిర్మాత రియా కపూర్ పరామర్శించింది.
ఇన్‌స్టా లైవ్‌లో షెహనాజ్ తన ఆరోగ్య పరిస్ధితి గురించి ఫ్యాన్స్‌కు అప్డేట్ చేసింది. అందరికీ సమయం వస్తుంది..మళ్లీ మంచి రోజులు వస్తాయి. నా విషయంలోనూ అదే జరిగింది. గైస్ ఇప్పుడు నేను బాగానే ఉన్నా..నాకు ఇన్ఫెక్షన్ సోకింది..నేను శాండ్విచ్ తినడంతో ఫుడ్ పాయిజన్ అయినట్టు డాక్టర్లు చెబుతున్నారని పేర్కొంది.
మరోవైపు లైవ్ సెషన్లో జాయిన్ అయిన అనిల్ కపూర్ షెహనాజ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. షెహనాజ్ జీ మీరు మరో ముంతాజ్ అందరూ చూస్తున్నారు..మీపై ప్రశంసలు గుప్పిస్తున్నారని అన్నారు.
Read More :
Sleeping | ఎంత నిద్రపోయాం అన్నదే కాదు.. ఎలా నిద్రపోయామన్నదీ ముఖ్యమే!