మహేష్ బాబు హీరోగా పరశురాం దర్శకత్వంలో సర్కారు వారి పాట సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే.ఇందులోకీర్తి సురేష్ కథానాయికగా నటిస్తుంది. హైదరాబాద్‌లో తాజా షెడ్యూల్ జరుపుకుంలుండగా, సెట్లోకి సడెన్‌గా కాంగ్రెస్ సీనియర్ ఎంపీ శశి థరూర్ వచ్చారు. ఆయన్ని అలా సడెన్‌గా చూసి చిత్ర బృందం మొత్తం షాక్ అయింది.
మాదాపూర్‌లోని స్టార్ హోటల్లో చిత్ర షూటింగ్ జరుగుతుండడంతో మహేష్ బావ గల్లా జయదేవ్‌తో సర్కారు వారి పాట షూటింగ్‌కి వెళ్లారు శశి థరూర్. ఈ విషయాన్ని తన ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. మాదాపూర్‌లోని ట్రిడెంట్ హోటల్లో ‘సర్కారు వారి పాట’ మూవీ షూటింగ్‌ను జరుపుకుంది.అది తెలిసి నేను నా సహా ఉద్యోగులతో కలిసి వెళ్లి మహేశ్‌ను కలిశాను. ఆయనతో కొద్ది సేపు మాట్లాడాను.
నిజంగా ‘సూపర్ స్టార్’ ఎంత గొప్ప వ్యక్తి. మహేష్‌ని కలుసుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. ఆయన విలన్‌తో పోరాడే సన్నివేశాలు పూర్తి చేశారు అంటూ తన ట్విట్లో పేర్కొన్నారు శశి థరూర్. అయితే శశి థరూర్ మాట్లాడుతున్న సమయంలోమహేష్ నవ్వుతూ కనిపించారు. మిమ్మల్ని కలుసుకోవడం నాకు సంతోషంగా ఉందని మహేష్ తన ట్వీట్లో పేర్కొన్నారు. కాగా, మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్, 14 ప్లస్ రీల్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న సర్కారు వారి పాట చిత్రాన్ని 2022 జనవరి 13న సంక్రాంతికి థియేటర్స్‌లోకి తీసుకురానున్నారు.
Talking to MaheshBabu @urstrulyMahesh shows you why no one in Hyderabad refers to him without the honorific “Superstar”! He had just finished knocking out the villain in his next production when we had a chat behind the scenes… @JayGalla pic.twitter.com/2ZaKSVBOIi
— Shashi Tharoor (@ShashiTharoor) September 8, 2021