Oke Oka Jeevitham Pre-Release Event | ఫలితం ఎలా ఉన్నా శర్వానంద్ మాత్రం ఏడాదికి రెండు, మూడు సినిమాలను చేస్తూ బిజీగా గడుపుతుంటాడు. గతేడాది ‘శ్రీకారం’, ‘మహాసముద్రం’ వంటి రెండు చిత్రాలతో ప్రేక్షకులను పలకరించాడు. అయితే ఈ రెండు చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర ఫేయిల్యూర్‌గా నిలిచాయి. ఇక ఈ ఏడాది భారీ అంచనాల మధ్య విడుదలైన ‘ఆడవాళ్ళు మీక జోహార్లు’ ఫలితం కూడా శర్వానంద్‌ను తీవ్రంగా నిరాశపరిచింది. ప్రస్తుతం శర్వానంద్ ఒక హిట్టు కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నాడు. ఈ క్రమంలో టైం ట్రావెల్ కాన్సెప్ట్‌తో ‘ఒకే ఒక జీవితం’ సినిమాతో ఈ సారి ఎలాగైన హిట్ సాధించాలని కసితో ఉన్నాడు. ఇప్పటికే చిత్రం నుండి విడుదలైన ప్రచార చిత్రాలు, ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ చేశాయి. ప్రస్తుతం మేకర్స్ ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు. తాజాగా మేకర్స్ ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్‌ను ప్రకటించారు.
‘ఒకే ఒక జీవితం’ ప్రీ రిలీజ్ ఈవెంట్ బుధవారం హైదరాబాద్‌లోని జేఆర్సీ కన్వెన్షన్‌లో సాయంత్రం 6 గంటల నుండి జరుగనున్నట్లు ప్రకటించారు. ఈ చిత్రంలో అక్కినేని అమల కీలకపాత్ర పోషించింది. ప్రమోషన్లో భాగంగా శర్వానంద్, అఖిల్‌తో కలిసి అమ్మ చేతి వంటి అని ఓ వీడియో చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. శ్రీకార్తిక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శర్వాకు జోడీగా రీతూవర్మ నటించింది. డ్రీమ్ వారియర్స్ పిక్చర్స్ పతాకంపై ఎస్.ఆర్ ప్రకాష్ బాబు, ఎస్.ఆర్ ప్రభు నిర్మిస్తున్నారు. ద్విభాషా చిత్రంగా తెరకెక్కిన ఈ మూవీ సెప్టెంబర్ 9న తెలుగుతో పాటు తమిళంలోనూ ఏకకాలంలో విడుదల కానుంది