శర్వానంద్, అనన్య, జై, అంజలి ప్రధాన పాత్రల్లో నటించిన ‘జర్నీ’ చిత్రం బాక్సాఫీప్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. మ్యూజికల్ లవ్‌స్టోరీగా హృదయాన్ని కదిలించే భావోద్వేగాలతో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. తాజాగా ఈ సినిమాను ఈ నెల 21న రీరిలీజ్ చేయబోతున్నారు. లక్ష్మీనరసింహా మూవీస్ పతాకంపై సుప్రియ శ్రీనివాస్ తెలుగులో రీరిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే బుకింగ్స్ కూడా మొదలయ్యాయని, పన్నెండేళ్ల తర్వాత రీరిలీజ్‌కు సిద్ధమవుతున్న ఈ చిత్రానికి అప్పటిలాగే ప్రేక్షకులు ఆదరణ కనబరుస్తారనే నమ్మకం ఉందని మేకర్స్ తెలిపారు.