టాలీవుడ్ హీరోల్లో ఉన్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్స్ లో పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ఫస్ట్ ప్లేస్‌లో ఉంటాడని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అయితే ఇటీవల కాలంలో ఏ బ్యాచ్ లర్ హీరోను పెళ్లి (marriage) గురించి అడిగినా ప్రభాస్ పేరునే సమాధానంగా చెబుతూ సింపుల్‌గా తప్పించుకుంటున్నారు. కొన్ని రోజుల క్రితం విశాల్ కూడా ప్రభాస్ పేరు చెబుతూ పెళ్లి టాపిక్‌ను దాటవేశాడు. అయితే ఇలా ప్రభాస్ (Prabhas)పేరు చెప్పే హీరోల జాబితాలో ముందువరుసలో ఉంటాడు శర్వానంద్ (Sharwanand) .
అయితే ఎప్పుడూ ప్రభాస్ పెళ్లితో ముడిపెట్టే శర్వానంద్ ఈ సారి మాత్రం పెళ్లి విషయంలో కాంప్రమైజ్ అయ్యాడన్న వార్త ఫిలింనగర్ సర్కిల్లో రౌండప్ చేస్తోంది. శర్వానంద్ ఓ ఎన్ఆర్ఐ అమ్మాయిని చూశాడని, త్వరలోనే ఈ ఇద్దరికి సంబంధించిన వెడ్డింగ్ అప్డేట్ రాబోతుందని వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఇండస్ట్రీ సర్కిల్ తాజా టాక్ ప్రకారం శర్వానంద్ చేసుకోబోయే అమ్మాయి సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కాగా.. కొన్ని నెలల క్రితం వరకు యూఎస్‌లో ఉందట. అయితే వర్క్ ఫ్రం హోం విధానంతో ఆమె స్వస్థలం హైదరాబాద్‌కు వచ్చేసిందని టాక్.
38 ఏండ్ల వయస్సున్న శర్వానంద్ సుమారు 15 సంవత్సరాలుగా యాక్టర్‌గా తెలుగు సినీ ఇండస్ట్రీలో కొనసాగుతున్నాడు. కొత్తదనంతో కూడిన కథలతో సినిమాలు చేస్తూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు శర్వానంద్. మరి పెళ్లి బాజా మోగనుంది నిజమేనా..? అనే దానిపై శర్వానంద్ ఏదైనా అఫీషియల్ అప్డేట్ ఇస్తాడేమోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు మూవీ లవర్స్.