తినేవాడి పేరు గింజలపై రాసి ఉన్నట్టు.. నటించేవాడి పేరు కథలపై ముందే రాసుంటుందేమో!. ఒక హీరో కోసం అనుకున్న కథలో మరో హీరో నటించడంలో పరమార్థం ఇదే అయ్యుంటుంది. ఆ మధ్య నితిన్ కోసం దర్శకుడు శ్రీనువైట్ల ఓ కథ రాసుకున్నాడు. వినిపించి ఓకే చేసుకున్నాడు కూడా. కానీ ఏమైందో ఏమో.. ఆ ప్రాజెక్ట్ పట్టాలకెక్కలేదు. ఇప్పుడు అదే కథ శర్వానంద్ దగ్గరకెళ్లింది.
ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ప్రస్తుతం సంపత్‌నంది దర్శకత్వంలో ఓ సినిమా, అభిలాష్ కంకర దర్శకత్వంలో మరో సినిమా చేస్తూ శర్వా బిజీగా ఉన్నారు. ఈ సినిమా తర్వాత శ్రీనువైట్ల సినిమాను పట్టాలెక్కించాలని శర్వా భావిస్తున్నారట.
ప్రస్తుతం శర్వానంద్ చేస్తున్న రెండు సినిమాలూ సీరియస్ మోడ్‌లో ఉంటాయట. వాటికి భిన్నమైన సినిమా చేయాలనే శ్రీనువైట్ల కథను ఓకే చేశారట శర్వానంద్. ఈ కథ శ్రీను వైట్ల మార్క్ వినోదంతో అద్భుతమైన ఎంటర్టైన్మెంట్తో సాగుతుందట. త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌ని అఫీషియల్‌గా అనౌన్స్ చేస్తారని తెలిసింది.