బాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌజ్ యశ్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్లో బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ (Sharukh Khan) నటిస్తోన్న తాజా చిత్రం పఠాన్ (Pathaan). మూడేళ్లకుపైగా లాంగ్ గ్యాప్ తర్వాత షారుఖ్ నుంచి వస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సిద్దార్థ్ ఆనంద్ డైరెక్ట్ చేస్తున్నాడు.
ఈ సినిమా అరుదైన ఫీట్‌ను ఖాతాలో వేసుకున్నట్టు బీటౌన్ సర్కిల్ సమాచారం. ICE theater formatలో వస్తున్న తొలి భారతీయ సినిమాగా అరుదైన రికార్డు పఠాన్ సొంతం చేసుకోవడం విశేషం. ప్రేక్షకులకు అద్బుతమైన ఎక్స్పీరియన్స్ అందించేలా తొలిసారి ఈ ఫార్మాట్లో పఠాన్ ని విడుదల చేయాలని యశ్ రాజ్ ఫిలిమ్స్ నిర్ణయించుకున్నట్టు సమాచారం. ఇప్పటివరకు టాప్ గన్..మావెరిక్, డాక్టర్ స్ట్రేంజ్..మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్, ది బ్యాట్‌మాన్ లాంటి పాపులర్ హాలీవుడ్ సినిమాలు ఈ ఫార్మాట్లో విడుదలయ్యాయి.
పఠాన్ 2023 జనవరి 25న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఇప్పటికే ప్రమోషన్స్ మొదలుపెట్టింది షారుఖ్ ఖాన్ టీం. పఠాన్‌లో దీపికా పదుకొనే ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. జాన్ అబ్రహాం కీలక పాత్రలో నటిస్తున్నాడు. హిందీ, తమిళం, తెలుగు భాషల్లో విడుదల కాబోతున్న పఠాన్ దీపికా-షారుఖ్ ఖాన్ కాంబినేషన్లో వస్తున్న మూడో సినిమా కావడం. ఇప్పటికే విడుదలైన టీజర్‌కు మంచి స్పందన వస్తోంది.
పఠాన్ టీజర్ ..