Sharathulu Varthisthai! | టాలీవుడ్ యువ నటుడు చైతన్య రావు, భూమి శెట్టి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘షరతులు వర్తిస్తాయి’. కుమార స్వామి (అక్షర) ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. స్టార్ లైట్ స్టూడియోస్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై శ్రీలత, నాగార్జున సామల, శ్రద్ద, శ్రీకుమార్ గుండా తదితరులు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్‌తో పాటు ‘పన్నెండు గుంజాల’ సాంగ్ విడుదల చేయగా.. ప్రేక్షకుల వద్ద నుంచి మంచి ఆదరణ లభించింది. ఇప్పుడు తాజాగా ఈ సినిమా నుంచి మేకర్స్ టీజర్ విడుదల చేశారు.
ఇక టీజర్ గమనిస్తే.. పల్లెటూరి కథ అని తెలుస్తుంది. కరీంనగర్ జిల్లాలో ఓ మధ్య తరగతి కుటుంబానికి చెందిన చిరంజీవి (చైతన్య రావు) తల్లి, తమ్ముడు, చెల్లి బాధ్యతలను భుజానికి ఎత్తుకొని బ్రతుకుతుంటాడు. అయితే అదే ప్రాంతానికి చెందిన విజయశాంతితో చిరంజీవి ప్రేమలో పడతాడు. ఇక ఈ సినిమాలో ఉన్న వ్యక్తుల పరిచయంతోనే టీజర్ మొత్తం సాగింది. ఫుల్ క్లాస్‌గా సాగిన ఈ టీజర్ ప్రస్తుతం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.